హృదయమనే కోవెలలో.. | - | Sakshi
Sakshi News home page

హృదయమనే కోవెలలో..

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

● చిన్నపిల్లల హృదయాలయంలో 27వ గుండె మార్పిడి సక్సెస్‌

తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. గుంటూరులోని కిమ్స్‌ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణం పోసింది. ఎయిర్‌ అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డు మార్గంలో తిరుపతికి తరలించారు. ఎస్పీసీహెచ్‌సీకి చెందిన ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ విజయ్‌, శ్యామ్‌బాబు గుండెతో పాటు ప్రయాణించి, వైద్య బృందంతో నిరంతర సమన్వయం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకోగా, వైద్య బృందం వెంటనే మార్పిడి ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి సమన్వయంతో, చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ దీపేష్‌ త్రివేది నేతృత్వంలో కార్డియాక్‌ అనస్థీషియాలజిస్ట్‌ డాక్టర్‌ మధుయాదవ్‌తో పాటు కార్డియాక్‌ సర్జన్లు, కార్డియాలజిస్టులు, వైద్య బృందం విజయంతంగా బాలికకు గుండె మార్పిడి చేసి ప్రాణం పోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement