వివాహితపై లైంగిక దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

వివాహితపై లైంగిక దాడికి యత్నం

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

దొరవారిసత్రం: బహిర్భూమికి వెళ్లిన వివాహితపై లైంగికదాడికి యత్నించిన ఘటన సోమవారం తెల్లవారు జామున బురదమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం..బురదమడుగు గ్రామానికి చెందిన వివాహిత రోజూలాగే గ్రామ సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అక్కడే కాపుకాసిన అదే గ్రామానికి చెందిన మొడెం చెంగయ్య ఆమైపె లైంగికదాడికి యత్నించాడు. కేకలు వేయడంతో ఆమె భర్త ఘటనా స్థలానికి చేరుకోవడంతో చెంగయ్య పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని బజారువీధిలో సోమవారం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. అధికలోడు పడి పేలిపోయినట్టు సమాచారం. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఐదుగురిపై కేసు

సైదాపురం: ఆస్తి తగదా విషయంలో మండలంలోని మర్లపూడి గ్రామానికి చెందిన మాదిరెడ్డి సుశీలమ్మపై దాడి చేసిన ఐదుగురిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బాధితురాలు సుశీలమ్మకు.. ఆమె చెల్లెలు రత్నమ్మ మధ్య ఆస్తి విషయంలో వివాదం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సుశీలమ్మపై ఒక్కసారిగా మాదిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు వెంకటేష్‌, చీర్ల అయ్యప్పరెడ్డి, చీర్ల పెంచలరెడ్డి, చీర్ల రాజేశ్వరి తదితరులు కలిసి రాళ్లు, చాకులతో దాడి చేయడంతో సుశీలమ్మ తీవ్రంగా గాయపడిందన్నారు. గాయపడిన సుశీలమ్మను కుటుంబ సభ్యులు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

రుయాలో

హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ కోర్సు

తిరుపతి తుడా: రుయా ఆసుపత్రిలో హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభించినట్లు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీ.రవిప్రభు తెలిపారు. రుయా ఆస్పత్రి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ తిరుపతి, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల కాలవ్యవధితో హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ కోర్సును వైద్యాధికారులతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలియేటివ్‌ కేర్‌ రోగులకు సేవలందించేందుకు శిక్షణ పొందిన సంరక్షకుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ.మనోహర్‌ మాట్లాడుతూ ఆస్పత్రితో పాటు ఇంటి వద్ద పాలియేటివ్‌ కేర్‌ అవసరమైన రోగులకు మెరుగైన సేవలందించగల నైపుణ్యం కలిగిన నర్సింగ్‌ సహాయకులను తీర్చిదిద్దడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement