తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగం– సూక్ష్మవీక్షణ విద్యార్థి విభాగం, మైక్రోబయాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో ‘చిన్న సూక్ష్మజీవులు–గొప్ప ప్రభావం’ ఇతివృత్తంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సూక్ష్మజీవ ప్రపంచం – చిన్న సూక్ష్మజీవులు, గొప్ప ప్రభావం’ అనే అంశంపై రంగోలి పోటీ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, రంగురంగుల చిత్రాల ద్వారా సూక్ష్మజీవుల ప్రాధాన్యతను చాటిచెప్పారు. అప్లైడ్ మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.సువర్ణలతాదేవి, ప్రొఫెసర్లు ఉమామహేశ్వరి, జయమాధురి, ఎంఎస్‌బీఐ విద్యార్థి విభాగం ప్రతినిధులు సాయిభార్గవి, గీత, సుస్రోనియా పాల్గొన్నారు.
గొర్రెపాటికి జైలు
శ్రీకాళహస్తి: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గొర్రెపా టి సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపా రు. సోమవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇద్దరు మహిళల ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.


