మోహన్‌బాబు యూనివర్సిటీతో ‘ఫిజిక్స్‌ వాలా’ ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబు యూనివర్సిటీతో ‘ఫిజిక్స్‌ వాలా’ ఒప్పందం

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

చంద్రగిరి: మోహన్‌ బాబు యూనివర్సిటీ ప్రాంగణం సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశంలోనే ప్రముఖ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఫిజిక్స్‌ వాలా’, మోహన్‌బాబు యూనివర్సిటీల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రో ఛాన్స్‌లర్‌ మంచు విష్ణు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌, పద్మశ్రీ డాక్టర్‌ మంచు మోహన్‌బాబు, ఫిజిక్స్‌ వాలా వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే, డైరెక్టర్‌ వినయ్‌ మహేశ్వరి, వైస్‌ ఛాన్స్‌లర్‌ పి.వి.రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబు మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మోహన్‌బాబు యూనివర్సిటీలో ప్రతి ఏటా సరికొత్త సాంకేతికతను, డిజైన్లను అందుబాటులోకి తెస్తూ దేశంలోనే మొదటి సారిగా వినూత్న విద్యా విధానాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఫిజిక్స్‌ వాలా వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో 6.5 కోట్లకు పైగా, యాప్‌లో 60 లక్షల మందికి పైగా విద్యార్థులకు 54 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించామని తెలిపారు. అనంతరం ఎంఓయూలను చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement