నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న నవాహ్నిక‘మహా సంకల్పసిద్ధి మహాయాగం’లో భాగంగా సోమవారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఉదయం సుందరకాండ సంపూర్ణ పారాయణం, సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువులో రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితరాజు దంపతులు, మాజీ శాసన సభ్యులు జీవీ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రేయస్సును కోరుతూ, లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అశోక్ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సాయంత్రం వేళ సీతారామ పట్టాభిషేకం, శ్రీరాముల వరి పల్లకీ ఉత్సవం నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరామ మూల మంత్ర యజ్ఞం సాగింది.


