ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

● ఐదుగురికి గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం

భాకరాపేట: భాకరాపేట సబ్‌స్టేషన్‌న్‌ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో చెట్టేవారిపాళెం గ్రామపంచాయతీ తొగుటపల్లికి చెందిన శంకరయ్య (60), సుబ్రహ్మణ్యం (65), విమలమ్మ (50), స్రవంతి (35), చైతన్య (6) గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement