ఆట్రిసోల్‌ టెక్నాలజీస్‌తో శ్రీరామ కళాశాల ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

ఆట్రిసోల్‌ టెక్నాలజీస్‌తో శ్రీరామ కళాశాల ఒప్పందం

Sep 22 2026 5:22 AM | Updated on Sep 22 2026 5:22 AM

తిరుపతి సిటీ: పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీ రామ ఇంజినీరింగ్‌ కాలేజ్‌, ఆట్రిసోల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సంబంధిత ప్రతినిధులు కళాశాల యాజమాన్యంతో సోమవారం ఒప్పందపు పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ మన్నెం రామిరెడ్డి మాట్లడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, ఇంటరాక్షన్‌, శిక్షణ, ప్లేస్మెంట్‌ సహకారం, పరిశ్రమకు అనుగుణమైన అభ్యసన అవకాశాలు అందుతాయన్నారు. విద్యార్థులు తరగతి గదిలో పొందే విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ యమన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్‌ మన్నెం అరవిందుకుమార్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జయచంద్ర, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వాసు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement