కమలమ్మకు భూమన నివాళి | - | Sakshi
Sakshi News home page

కమలమ్మకు భూమన నివాళి

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

తిరుపతి మంగళం : దివంగత వైఎస్‌ రాజారెడ్డి సోదరి కమలమ్మ మృతి చెందారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి శనివారం పులివెందులలో కమలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి అయిన వైఎస్‌ విజయమ్మతో భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. కమలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

కామెర్ల మందుకు వెళ్లిన యువకుడి అదృశ్యం

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌): తొట్టంబేడు మండలం కొత్త కన్నలి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మునెమ్మ దంపతుల కుమారుడు పి.మునిశేఖర్‌ (30) కనబడడం లేదని టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఈనెల 17వ తేదీ సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. మునిశేఖర్‌ కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు.ఈనెల 12వ తేదీ ఉదయం కామెర్లకు మందులు తీసుకురావడానికి తమిళనాడు రాష్ట్రంలోని వాలాజీ గ్రామానికి వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే అతను తిరిగి ఇంటికి రాలేదని, కుటుంబ సభ్యులందరూ వాలాజీ, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. గతంలో కూడా అతను రెండుసార్లు కామెర్ల మందుల కోసం వాలాజీ గ్రామానికి వెళ్లి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి గల్లంతయిన మునిశేఖర్‌ ఆచూకీ కోసం వివిధ కోణాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సీటు కోసం మహిళల ఘర్షణ

రైల్వేకోడూరు అర్బన్‌: తిరుపతి నుంచి రైల్వే కోడూరుకు మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుండగా కొందరు కోడూరుకు చెందిన మహిళలు సీట్లకోసం తగువులాడుకుంటూ శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగారు. చివరకు జుట్లు పట్టుకుని కొట్టుకొనే వరకు వెళ్లారు. కొందరు మహిళలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వారి బంధువులకు ఫోన్లు చేసి పిలవడంతో మాధవరం పోడువద్ద బస్సును ఆపేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బస్సును పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చి విచారించారు. కొందరు మహిళలు 3 తులాల బంగారు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

ప్రజా ఉద్యమంగా

స్వచ్ఛతా హి సేవా

తిరుపతి అర్బన్‌: పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తిరుపతి జిల్లా సాధన దిశగా స్వచ్ఛతా హి సేవా– 2026ను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ మీటింగ్‌ ద్వారా మండల, మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖలు, స్థానిక సంస్థలు సమన్వయంతో సమర్థవంతంగా నిరహించాలని ఆదేశించారు. నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో స్పష్టమైన, శాశ్వతమైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చ్ఛతా హి సేవా కార్యక్రమాల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్వహించిన కార్యక్రమాలను సమగ్రంగా డాక్యుమెంట్‌ చేసి, నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం నివేదికలు సమర్పించాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement