నకిలీ బంగారం కుదువబెట్టి మోసం | - | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం కుదువబెట్టి మోసం

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని సత్యసాయి కుదువ దుకాణంలో గంగసాయి అనే వ్యక్తి నకిలీ నకిలీ బంగా రం పెట్టి రూ.2లక్షలకు పైగా నగదు తీసుకుని మోసం చేసినట్లు దుకాణ యజమాని సముద్రాల మురళీకృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిట్టమూరు మండలం యాకసిరి పాటిమిట్టకు చెందిన గంగసాయి అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం బంగారు గాజులు తీసుకువచ్చి కుదువపెట్టాలని చెప్పి సుమారు రూ.2లక్షల కు పైగా నగదు తీసుకున్నట్లు తెలిపారు. మరలా మరో బంగారు చైను తీసుకురావడంతో అనుమానం వచ్చి ఆ చైను పరిశీలించగా నకిలీ బంగారంగా తేలిందన్నారు. అంతేకాకుండా ఇటీవల పెట్టిన బంగారు గాజులు కూడా నకిలీవిగా తేలడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయినట్లు మురళీకృష్ణ పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement