సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో మలయప్ప
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకరణలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం కల్పవృక్ష వాహనంపై
రాజమన్నార్ అలంకరణలో అభయమిచ్చారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం రాత్రి స్వామివారు తనకిష్టమైన గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. – తిరుమల


