ఏర్పేడు: స్వచ్ఛతా హి సేవా 2026 ప్రచారంలో భాగంగా శుక్రవారం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో విద్యార్థులచేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బాధ్యతాయుతమైన పౌర భాగస్వామ్యం పట్ల తమ నిబద్ధతను ధృవీకరిస్తూ తిరుపతి ఐసర్ రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) లెఫ్టినెంట్ కమాండర్ కుమార్ హిమాంశు శేఖర్ (రిటైర్డ్), జాయింట్ రిజిస్ట్రార్ రమేష్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 68,265 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.16 కోట్ల కానుకలు లభించాయి. టైమ్‌స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లో దర్శనం చేసుకోగలుగుతున్నారు.


