సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం చివరి తేదీ కావడంతో తిరుపతి అర్బన్‌కు చెందిన ఎడ్యుకేషన్ డేటా ఎంట్రీ సెక్రటరీ కీర్తనబాబు ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటూనే విధులు నిర్వహించారు. తిరుపతిలోని మధురానగర్ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ఆయన వారానికి రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లి డయాలసిస్ చేసుకుంటున్న తరుణంలో శుక్రవారం డయాలసిస్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మొబైల్ ద్వారా పింఛన్ల దరఖాస్తుల సమాచారాన్ని సేకరిస్తూ.. కంప్యూటర్‌లో నమోదు చేశారు.
– తిరుపతి అర్బన్


