నేడు తుమ్మలగుంటలో గరుడోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు తుమ్మలగుంటలో గరుడోత్సవం

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమోక్తంగా విశేష అలంకరణలతో గరుడోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో గరుడసేవను దర్శించలేని శ్రీవారి భక్తులు తుమ్మలగుంటకు విచ్చేసి గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏర్పాట్లుపై చెవిరెడ్డి ఆలయ అధికారులు, గ్రామ పెద్దలతో సమీక్షించారు. సమావేశంలో తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో పాటు ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

రెండో విడత

డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఓఏఎమ్‌డీసీ శుక్రవారం నుంచి ఈనెల 21 వతేదీ సోమవారం వరకు విద్యార్థులు రిజి స్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 20 నుంచి 24వ తేదీవరకు ఆన్‌లైన్‌ ధ్రువపత్రాల వెరిఫికేషన్‌, 21 వతేది నుంచి 23 వరకు వెబ్‌ ఆప్షన్లు, 24న ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించి, 27వ తేదీన రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలలో 28వ తేదీ నుంచి 30వ తేదీ లోపు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

21న డీఫార్మసీ

స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల కాల వ్యవధితో కూడిన డీఫార్మసీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం సోమవారం స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఉత్తీర్ణులైన ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకానున్న అభ్యర్థులు ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉదయం 10గంటలకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement