కలుజును అమ్మేశారు! | - | Sakshi
Sakshi News home page

కలుజును అమ్మేశారు!

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

● వెంకటాపురం టీడీపీ నేతల తీరే వేరయా ● ఆ స్థలంలో ప్రైవేటు కళాశాల ప్రహరీ నిర్మాణం ● కలుజు అని తెలిసినా పట్టించుకోని రెవెన్యూ ● అంతా కుమ్ముకై ్క నీరు వెళ్లే కాలువ అక్రమణ

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రేణిగుంట మండలం, వెంకటాపురం చెరువు కలుజు భూమిని అంతా కుమ్ముకై ్క ఓ ప్రైవేటు కళాశాలకు అమ్మేసినట్లు విశ్వసనీయ సమాచారం. చెరువు నీరు వెళ్లకుండా కళాశాల యాజమాన్యం కలుజుపై ప్రహరీ నిర్మాణానికి పూనుకుంది. కలుజు కాలువ అని తెలిసినా.. రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. తిరుపతి– కరకంబాడి మార్గంలోని వెంకటాపురం సర్వే నం.227లో 74 సెంట్ల కలుజు కాలువను టీడీపీ నేతలు ఓ ప్రైవేటు కళాశాలకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కలుజు దురాక్రమణ విషయం పత్రికలు, మీడియాలో ప్రసారం కావడంతో కళాశాల యాజమాన్యం లబోదిబోమంటున్నట్లు తెలిసింది. టీడీపీ, కొందరు రెవెన్యూ అధికారులను నమ్మి కొనుగోలు చేస్తే ఇలా అయ్యిందేంటని అంటున్నారు. కలుజు కాలువను అక్రమంగా అమ్మడమే కాకుండా.. మరింత నగదు రాబట్టుకునేందుకు కొన్ని యూటూబ్‌ చానల్స్‌ వారిని కళాశాల యాజమాన్యం వద్దకు పంపి బ్లాక్‌మైయిల్‌ చేసినట్లు వెంకటాపురంలో ప్రచారం జరుగుతోంది. రూ.3 కోట్ల విలువచేసే కలుజు కాలువ విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా పర్యటించి.. వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీని వేసినట్లు తెలిసింది. కలుజు కాలువ అని స్పష్టంగా రికార్డుల్లో ఉన్నా.. రెవెన్యూ అధికారులు కమిటీ వేసి నాన్చివేత ధోరణి అవలంభించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కలుజు కాలువ ఇరిగేషన్‌కి సంబంధించింది అయినా.. సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement