తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్ సెల్, ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు డ్రీమ్స్ టు డీడ్స్ ప్రేరణాత్మక సదస్సు నిర్వహించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సుకు హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి భోదమయానందజీ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణతో విద్యార్థులు తమ కలలను సాకరం చేసుకునేందుకు శ్రమించాలని సూచించారు. స్వామి వివేకానంద బోధించిన లేవండి మేల్కొనండి లక్ష్యం చేరే వరకు శ్రమించండి అనే దివ్య మంత్రాన్ని విద్యార్థులు తమ జీవితంలో ప్రతి నిత్యం గుర్తించుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రయ్య, యూహెచ్‌వీ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ సుజన్‌కుమార్, అధ్యాపకులు, ప్రథమ సంవత్సంరంలో ప్రవేశాలు పొందిన బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు.


