మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

● 15 కేజీల గుట్కా స్వాధీనం

తిరుత్తణి: ఆంధ్రా నుంచి కాంచీపురానికి ప్రయివేటు బస్సులో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను తిరుత్తణి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె – తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి చెక్‌ పోస్టు వద్ద గురువారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని నగరి నుంచి తిరుత్తణి మార్గంలో కాంచీపురం వెళుతున్న ప్రయివేటు బస్సులో నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చైన్నెకి చెందిన శరవనన్‌(47), అరక్కోణంకు చెందిన కమల్‌రాజ్‌(42), తిరువణ్ణామలైకు చెందిన రామమూర్తి(35) ఆంధ్రాలోని తిరుపతిలో మత్తు పదార్థాలు కొనుగోలు చేసి కాంచీపురం తరలిస్తున్నట్లు తేలింది. వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement