కలెక్టర్‌ విస్తృత పర్యటన | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ విస్తృత పర్యటన

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

రామచంద్రాపురం: మండలంలో శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులతో పాటు, భూముల రీ–సర్వే ప్రక్రియను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలోని కమ్మపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న నీటి కుంటలు, వ్యవసాయ కుంట నిర్మాణ పనులను డ్వామా పీడీ మద్దిలేటి, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఏడాదిగా లభించిన పని దినాలు, రోజువారీ సగటు వేతనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమ్మపల్లి పంచాయతీలో రీ–సర్వే తరువాత తలెత్తిన భూ అభ్యంతరాలు, సర్వే నంబర్లలోని వ్యత్యాసాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, అడంగల్‌ తదితర రికార్డులను రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధుసూదన్‌, ఎంపీడీవో పులి రాంసింగ్‌, మండల స్వర్ణ గ్రామ అధికారి తేజోవతి, ఏపీవోలు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement