చిత్తూరు–మదనపల్లి వైపు నుంచి వచ్చే బస్సులు కాలురు క్రాస్ మీదుగా ఆర్సీ.పురం జంక్షన్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లైఓవర్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్ వైపు మళ్లింపు
చైన్నె, పుత్తూరు వైపు నుంచి వచ్చే బస్సులు సింధు ఫ్లైఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లై ఓవర్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్ వైపు మళ్లింపు
కడప – శ్రీకాళహస్తి వైపు నుంచి తిరుపతికి వచ్చే బస్సులు రమణ విలాస్ జంక్షన్, గాజులమండ్యం సర్కిల్ మీదుగా సింధు ఫ్లైఓవర్, తనపల్లి జంక్షన్ మీదుగా గరుడ ఫ్లైఓవర్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్ వైపు మళ్లింపు.
తిరుపతి అర్బన్: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ (ఈనెల 19వ తేది శనివారం) సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రధానంగా టీటీడీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు వాహనాల పైన ఆంక్షలు విధిస్తున్నామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాల ద్వారా తిరుమలకు చేరుకోవాలని సూచించారు.
ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు
ఈనెల 18వ తేదీ రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు బాలాజీ లింక్ బస్తాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు


