తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 66 డివిజన్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం రాజముద్ర వేసింది. కార్పొరేషన్ 50 డివిజన్ల నుంచి 66కు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్‌తో కూడిన గెజిట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇటీవల అభ్యంతరా లు, సూచనలు ఉంటే చేయాలని ఏడు రోజుల పాటు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం 33 ఫిర్యాదులు, అభ్యంతరాలు కార్పొరేషన్‌కు అందాయి. వాటిని పరిశీలించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిన్న మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 66 డివిజన్లకు ఆమోదం తెలిపింది.


