అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ?

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

కాళంగి వంతెన నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సూళ్లూరుపేట: రెండున్నరేళ్లు కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి శిథిలావస్థకు చేరుకున్న కాళంగి వంతెనను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని అవినీతి పథంలో నడిపిస్తున్నారని విమర్శించారు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలో కాళంగి నదిపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వంతెన గురించి నాటి ముఖ్యమంత్రి మా జగనన్నకు చెప్పి 2023 నవంబర్‌ 6 జీఓ ఆర్‌టీ నం.325 ద్వారా రూ.35 కోట్లు మంజూరు చేస్తే.. దానికి టెక్నికల్‌ మంజూరు చేయించుకునే లోపు ఎన్నికల కోడ్‌ రావడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో మేము పనులు చేయలేకపోయామన్నారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా సీఎంతో మాట్లాడాను అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఎంతసేపు ఎమ్మెల్యే కుటుంబం ప్రకృతి వనరుల్ని పర్సెంటేజీలకు అమ్మేయడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.

రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పండి?

అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులా?

ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏమిటని కిలివేటి అన్నారు. మా నాయకుడు సత్యనారాయణరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి రెండోసారి జైలుకు పంపడం వెనుక కుట్రకోణం దాగి ఉందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్‌రెడ్డి, నాయకులు స్వామిరెడ్డి, జెట్టి వేణుయాదవ్‌, మీజూరు రామకృష్ణారెడ్డి, అలవల సురేష్‌, వాకాటి బాబురెడ్డి, బద్దెపూడి మోహన్‌రెడ్డి, మల్లిరెడ్డి, చిలకా యుగంధర్‌, అయితా శ్రీధర్‌, కాకి శ్రీరామ్మూర్తి, మాదరపాక సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement