నిందితులకు ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

నిందితులకు ఐదేళ్ల జైలు

Sep 12 2026 12:30 AM | Updated on Sep 12 2026 12:30 AM

తిరుపతి లీగల్‌ : ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, కోయిలాంబూర్‌కు చెందిన ముత్తుస్వామినాథన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి, రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషనన్‌ జడ్జి కోర్టు ఇన్‌చార్జ్‌ జడ్జి అర్చన శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం.. ఎరచ్రందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, టీఎన్‌ పాలెం సెక్షన్‌, మేకలబండ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో స్వామినాథన్‌ ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్‌ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే మరో కేసులో వైఎస్సార్‌ కడప జిల్లా, సానిపయ్య రేంజ్‌, పింఛ సెక్షన్‌, దిన్నెలబీట్‌, ఏడు ఆవుల ధర్తీ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఏడు ఎరచ్రందనం దుంగలను తరలిస్తున్న కేసులో తమిళనాడు, విల్లుపురం జిల్లా, చిన్న సేలం తాలూకా, ఇన్నాడు గ్రామానికి చెందిన కె.రాజీవ్‌గాంధీకి ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement