– బ్రేక్ ఫెయిల్ కావడంతో డివైడర్‌పైకి ఎక్కిన కారు
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవా రం ప్రమాదం చోటుచేసుకుంది. చైన్నెకి చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయా ణంలో వారు వస్తున్న కారుకు మొదటి మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. కారులో దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనతో ఘాట్ రోడ్డులో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ గణాంక అధికారుల సంఘం ఏపీఎస్పీడీసీఎల్ యూనిట్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నరేంద్ర నాయుడు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా టీ. రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం. శివకుమార్, కోశాధికారిగా ఎం.ఎన్.పి. శైలజ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జె. సుభాష్ చంద్రబోస్, ఎస్.సిన్హా, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ అనిల్‌కుమార్, కేవీ సుబ్బారావు, సంస్థాగత కార్యదర్శులుగా వై.ఆర్. రవికుమార్‌రెడ్డి, ఆర్.పాపయ్య, మహిళా ప్రతినిధిగా ఎస్. ప్రశాంతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టీ.వెంకట సుబ్బయ్య, సి.శ్రీనివాసులు, జె.రామకృష్ణ, ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్.అశోక్ వర్ధన్ గుప్తా ఎన్నికయ్యారు. ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం.మురళీకుమార్, ఎం.శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మధుసూదన్, సంయుక్త కార్యదర్శి పి.బాలాజీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు.


