తిరుపతి లీగల్: వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిన మాత్రాన భయపడే ప్రసక్తే ఉండదని తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు పసుపులేటి సురేష్ వాసు యాదవ్‌తో పాటు మరో నలుగురు మీడియా ప్రతినిధులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు వారిని రిమాండ్‌లో భాగంగా తిరుపతి సబ్ జైలుకు తరలించారు. తిరుపతి సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను భూమన కరుణాకరరెడ్డి సోమవారం కలిశారు. ఆయనతోపాటు తిరుపతి జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ. చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తపల్లి విజయ్‌కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ తిరుపతి అధ్యక్షుడు మల్లం రవిచంద్రరెడ్డి ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


