దళారీల గుప్పిట్లో ధాన్యం | - | Sakshi
Sakshi News home page

దళారీల గుప్పిట్లో ధాన్యం

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

● ఇప్పటికే ఇసుక, మట్టి ట్రాక్టర్ల కింద పడి ఆరుగురి దుర్మరణం ● తాజాగా ఓ యువకుడి మృతి ● స్వర్ణముఖి నదితోపాటు చెరువుల విధ్వంసం ● అడ్డుకోలేని దుస్థితిలో అధికార యంత్రాంగం – 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

రైతులకు గిట్టుబటు ధర దక్కడం లేదు. దీంతో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై నిలువునా దోచుకుంటున్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యథేచ్ఛగా వనరుల దోపిడీ

సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

విలపిస్తున్న చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు

చియ్యవరం మృతుల ఘటనలో రోదిస్తున్న కుటుంబీకులు (ఫైల్‌)

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమార్జనే లక్ష్యంగా మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటోంది. అందులో భాగంగా స్వర్ణముఖి నదిలో ఇసుకను ఊడ్చేసింది. చెరువుల్లోని మట్టిని యథేచ్ఛగా తవ్వేసి అమ్మేస్తోంది. అక్రమ రవాణాకు వినియోగించే టిప్పర్లు.. ట్రాక్టర్లతో రహదారులను ఛిద్రం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రజల ప్రాణాలను గాలిలో దీపంగా మార్చేసింది. అధికంగా ట్రిప్పులు వేయించి త్వరితగతిన సొమ్ములు మూటగట్టుకోవాలనే దురాశతో జనాల ఉసురు తీసేస్తోంది. ఆదివారం ఈ మేరకే ఓ యువకుడి నిండు బతుకును మట్టితో కప్పెట్టేసింది. రూ.కోట్లు కూడబెట్టుకునే పనిలో సామాన్యుల జీవితాలను చీకటిమయంగా మార్చేస్తోంది. అయినప్పటికీ అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అక్రమార్కులను అడ్డుకోలేక తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులుదులిపేసుకుంటోంది.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌:జిల్లాలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి. ప్రకృతి సంపద ను కొల్లగొట్టి రూ.కోట్లు పోగేసుకునేందుకు అక్రమా ర్కులు మాఫియా మారి రెచ్చిపోతున్నారు. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో దందా సాగి స్తూ వాటాలు పంచుకుంటున్నారు. తమ అక్రమార్జనకు ప్రజను బలి చేస్తున్నారు. ఇసుక, మట్టి మాఫియాను అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

ముఖ్యనేత అండదండలతోనే..

నియోజకవర్గంలో అన్ని మండలాల మీదుగా స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇసుక పుష్కలంగా లభిస్తోంది. దీంతో రాత్రింబవళ్లు జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. తొట్టంబేడు మండలంలోని పూడి, పెన్నలపాడు, పెద్దకనపర్తి, గద్దగుంట, శ్రీకాళహస్తి మండలంలోని వేడాం, రామాపురం, ఏర్పేడు మండలంలోని కొత్తవీరాపురం, ముసలిపేడు, పాపానాయుడుపేట, పెనుమల్లం, పెన్నగడ్డం ప్రాంతాల నుంచి భారీగా ఇసుక రవాణా సాగుతోంది. శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు, వాంపల్లి, బీవీపురం, తొట్టంబేడు మండలంలోని కళ్లిపూడి, తాటిపర్తి, తొట్టంబేడు, శివనాథపాళెం, ఏర్పేడు మండలం చిందేపల్లి, నచ్చనేరి, అంజిమేడు ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు అధికంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ట్రాక్టర్లు అధిక లోడ్డుతో మితిమీరిన వేగంతో వెళుతుంటాయి. దీంతో తరచూ దారిన వెళ్లే అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నాయి. మొత్తం దందాను నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. అక్రమార్కులపై అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకుండా సదరు ముఖ్యనేత అండదండలందిస్తున్నట్లు తెలుస్తోంది.

రియల్‌ వెంచర్లకు తరలిస్తూ..

నియోజకవర్గంలో ఎక్కడ రియల్‌ వెంచర్‌ వెలిసినా, అవసరమైన మట్టిని అధికారపార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జేసీబీలు, హిటాచీల సాయంతో చెరువులు, అటవీ శివారు భూములు, బీడు భూములలో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. గ్రామాల్లోని చెరువుల కట్టలను తెగ్గొట్టి 30అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తరలిస్తున్నా కనీసం ఇరిగేషన్‌ అధికారుల జాడే కనిపించడం లేదు. అధికారులకు రాజకీయ ఒత్తిడి ఉండడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనికితోడు ఎవరైనా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే, చర్యలు తీసుకోవటం మానేసి, ఫిర్యాదు చేసిన వారి వివరాలను మాఫియా పెద్దలకు చేరవేయడంతో వారు భౌతికదాడులకు పాల్పడుతున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.

ఆలయంలోకి వర్షపు నీరు

నాగలాపురం: నాగలాపురంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలోకి నీరు చేరింది. ఆలయ ప్రాంగణలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు రావడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆలయం నుంచి వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,673 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

అక్రమ మైనింగ్‌ను అరికట్టాలి

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. ఇసుక, మట్టి తరలింపుల్లో నంబర్‌ ప్లేట్లు లేని ట్రాక్టర్లు నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. నంబర్‌ ప్లేట్లు లేని ట్రాక్టర్లు మట్టి తోలుతుంటే ఆర్‌టీఏ అధికారులు ఏం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదు. కలెక్టర్‌, ఎస్‌పీ అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతి

దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయి

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలో ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. సామాన్యులను మట్టి, ఇసుక ట్రాక్టర్లతో గుద్ది చంపేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే ఎమ్మెల్యేకు లెక్కలేదా? అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌ వెంటనే దర్యాప్తు చేయించాలి. చంద్రబాబుకు ఇక్కడి ఇసుక, మట్టి మాఫియా ఆగడాలు కనబడడంలేదా..? మీ దుర్మార్గాలకు రోజులు దగ్గరపడ్డాయి. – బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement