ఆటోను ఢీకొన్న బొలేరో | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న బొలేరో

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

– ముగ్గురికి గాయాలు

పుల్లంపేట : మండలంలోని అనంతంపల్లె వద్ద ఆదివారం తిరుపతి–కడప ప్రధానరహదారిపై ఆటోను బొలేరో వాహనం ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

చంద్రగిరి : మండలంలోని రామిరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 50) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. చంద్రగిరి–కొటాల మార్గంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. వాహనం పక్కన పెట్టి ఒక్కసారిగా రైలు కింద తలపెట్టాడు. అయితే మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ఈ మేరకు రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

చెట్టును ఢీకొన్న కారు

– ముగ్గురికి గాయాలు

చంద్రగిరి : శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం హైదరాబాదుకు చెందిన యాదగిరి కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిమెట్టు కాలినడకన వెళ్లేందుకు కారులో వచ్చారు. శ్రీనివావాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు వెళుతుండగా కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవరు ప్రేమ్‌ కుమార్‌ క్షేమంగా బయటపడగా, యాదగిరితో పాటు రమాదేవి, పద్మ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో

బస్సు అద్దాలు ధ్వంసం

నాగలాపురం: స్థానిక ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మద్యం మత్తులో పల్లెవెలుగు బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. బస్సు కండక్టర్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరి మృతి

నాగలాపురం : మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద ఆదివాంర చైన్నె హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు., మరొకరు గాయపడ్డారు. వివరాలు.. నాగలాపురం తూర్పు దళితవాడకు చెందిన సత్యరాజ్‌ (36) ద్విచక్రవాహనంలో ఊత్తుకోటైకి బయలుదేరాడు. తమిళనాడులోని తండల గ్రామానికి ప్రభాకర్‌ నందనం వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. క్షతగాత్రులను 108లో నాగలాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సత్యరాజ్‌ మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement