బీఎల్‌ఏలకు జాబితా ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలకు జాబితా ఇవ్వాలి

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

నోటీసులు జారీ చేసిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీ నేతలకు సంబంధించిన బీఎల్‌ఏలకు అందించాలి. నోటీసులు జారీ చేసిన జాబితాను ఎన్నికల నిబంధనల మేరకు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి. అప్పుడే నోటీసులు అందుకున్న ఓటర్ల ను ఎప్పటికప్పుడు బీఎల్‌ఏలు అప్రమత్తం చేసి విచారణకు తీసుకువచ్చే అవకాశముంటుంది.

– వినోద్‌కుమార్‌, చంద్రగిరి

ఓటరుకే నోటీసు ఇవ్వాలి

మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ఇచ్చే నోటీసులు వారికే ఇవ్వాలి. అలా కాకుండా పక్క ఇంటి వారికి, ఎదురు ఇంటి వారికి ఇచ్చి వెళ్లడం ద్వారా ఓటర్లకు సక్రమంగా నోటీసులు అందడం లేదు. మరోవైపు నోటీస్‌ సీరియస్‌ నెస్‌ వారికి తెలియడం లేదు. ఈ క్రమంలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకుంటే ఇబ్బందులు వస్తాయి. – యశ్వంత్‌, ఆర్‌సీ పురం

గందరగోళం తప్పదు

నిజమైన ఓటు తొలగిస్తే గందరగోళం తప్పదు. ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల ఓట్లు పోయాయి. ఇక నోటీసులు ఇచ్చిన వారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లు తొలగిస్తే వివాదాలు తప్పవు. ఈ విషయంలో బీఎల్‌ఏలను సమన్వయం చేసుకోవాలి.

– చెంగల్‌రెడ్డి, ఎర్రావారిపాళెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement