శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఇద్దరిని బలితీసుకున్న వేగం
అతి వేగం ఇద్దరిని బలితీసుకుంది. ఈ ఘటన నాయుడుపేట మండల పరిధిలోని అయ్యప్ప రెడ్డిపాళెం వద్ద చోటు చేసుకుంది.

ఇద్దరి అరెస్ట్‌

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన ఏర్పేడు మండలంలో చోటుచేసుకుంది.

శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026

తిరుపతి జిల్లాలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు, రాపూరు, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక వ్రతాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో అమ్మవారు బంగారు చీరతో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి పుష్పాలతో ఆరాధించారు. తరువాత 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. మహా మంగళ హరతితో వరలక్ష్మీవ్రతం ముగిసింది. సాయంత్రం స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగారు. – చంద్రగిరి, రాపూరు, శ్రీకాళహస్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement