ముగిసిన తిరుమల నంబి అవతార మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన తిరుమల నంబి అవతార మహోత్సవాలు

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

● కిలో రూ.150

తిరుమల: తిరుమల ప్రథమ పౌరుడిగా తిరుమలేశునికి కై ంకర్యం చేసి తరించిన మహనీయుడు తిరుమలనంబి వారి 1053వ అవతార మహోత్సవాలు తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో ఉన్న తిరుమల నంబి వారి సన్నిధిలో శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసిన 16 మంది పండితులు తిరుమల నంబి జీవితంపై ఉపన్యాసాలు చేశారు. 101 సంవత్సరాలు నిండిన పండితుడు శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. టీటీడీ అదనపు ఈవో సి.చ్‌.వెంకయ్యచౌదరి, టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఎం.తిరుమళిశై ఆళ్వార్‌, తిరుమల నంబి వంశీయులు టి.కె.శేషాద్రి స్వామి, టి.కె.ముకుంద తాతాచార్యులు పాల్గొన్నారు.

నిమ్మ అధరహో

సైదాపురం: నిమ్మ ధరలు ఊరిస్తున్నాయి. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రూ.100 నుంచి రూ.150 ధర పలుకుతున్నాయి. వరలక్ష్మీవ్రతాన్ని పురస్కరించుకుని గత రెండు రోజులుగా గూడూరు నిమ్మ మార్కెట్‌లో లూజు (50 కేజీ బస్తా) రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు పలికింది. నాణ్యత కలిగిన నిమ్మ కాయలకు మరింత ధర లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement