దిగజార‘బడి’! | - | Sakshi
Sakshi News home page

దిగజార‘బడి’!

Aug 20 2026 7:38 AM | Updated on Aug 20 2026 7:38 AM

చతికలపడుతున్న హైస్కూల్‌ ప్లస్‌లు

నిర్వీర్యం చేస్తున్న కూటమి నేతలు

అవస్థలు పడుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు

బలోపేతం చేయాలంటున్న నిపుణులు

గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత విద్యకు దోహదపడే హైస్కూల్‌ ప్లస్‌లను కూటమి నేతలు నిర్వీర్యం చేస్తున్నారు. సకాలంలో ఖాళీలు భర్తీ చేయకుండా దిగజార్చుతున్నారు. అప్‌గ్రేటేషన్‌ కూడా కల్పించకుండా నాన్చుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాఠశాలలను కక్ష సాధింపులతో సర్వనాశనం చేస్తున్నారని తల్లిదండ్రులు

మండిపడుతున్నారు.

తిరుపతి ఎడ్యుకేషన్‌ : గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 07–07–2022న జీఓ ఎంఎస్‌ నెం.124 ద్వారా తొలిదశలో 292 ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్‌ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్‌ చేసింది. అలాగే 20–02–2024న జీఓ ఎంఎస్‌ నెం.14 ద్వారా మరో 210 హైస్కూళ్లను హైస్కూల్‌ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి అనుమతించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 502 పాఠశాలలు హైస్కూల్‌ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. ఇంటర్‌ విద్యను బోధించడానికి అర్హత కలిగిన ఉపాధ్యాయులను పీజీటీలుగా అవకాశం కల్పించి వారి సేవలను వినియోగించుకుంది. వీరికి ఒక అదనపు ఇంక్రిమెంట్‌ను కూడా కల్పించింది.

తిరుపతి జిల్లా వ్యాప్తంగా

పీజీటీ పోస్టుల సంఖ్య

ఉపాధ్యాయుల డిమాండ్లు

1, హై స్కూల్‌ ప్లస్‌లలో అనుభవం, అవసరమైన విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులను పదోన్నతుల ద్వారా పీజీటీలుగా నియమించాలి.

3. హైస్కూల్‌ ప్లస్‌లలో పనిచేసే పీజీటీలకు జూనియర్‌ లెక్చరర్‌ స్థాయికి అనుగుణంగా రెగ్యులర్‌ కేడర్‌, సర్వీస్‌ విధానం కల్పించాలి.

4. తాత్కాలిక డిప్లాయ్‌మెంట్‌లపై ఆధారపడకుండా, దీర్ఘకాలికంగా కొనసాగ గల శాశ్వత వ్యవస్థను రూపొందించాలి.

5. పీజీటీలకు గతంలో ఇచ్చిన ఒక ఇంక్రిమెంట్‌ను పారితోషికంగా కాకుండా రెగ్యులర్‌ ఇంక్రిమెంట్‌గా పరిగణించాలి.

6. ప్రస్తుతం డెప్యుటేషన్‌ ద్వారా హైస్కూల్‌ ప్లస్‌లలో పనిచేస్తున్న పీజీటీలకు సైతం తగిన ఇంక్రిమెంట్‌ ప్రయోజనం కల్పించాలి.

7. హైస్కూల్‌ ప్లస్‌ల ప్రాధాన్యత నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హైస్కూల్‌ ప్లస్‌గా హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేయాలి.

8. పదో తరగతిలో 50 మందికిపైగా విద్యార్థులున్న ప్రతి ప్రభుత్వ హైస్కూళ్లను అవసరానికి అనుగుణంగా హైస్కూల్‌ ప్లస్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలి.

9. పీజీటీ పోస్టుల ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేయాలి.

నిర్వీర్యం చేస్తున్న కూటమి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమైన హైస్కూల్‌ ప్లస్‌లను నిర్వీర్యం చేసింది. ఇందులో పనిచేస్తున్న పీజీటీల బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణలతో ఏర్పడ్డ ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహించింది. అనేక హైస్కూల్‌ ప్లస్‌లలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో నాణ్యమైన బోధన అందించలేని దుస్థితి నెలకొంది. దీంతో హైస్కూల్‌ ప్లస్‌లలో విద్యార్థుల చేరిక తగ్గుముఖం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement