తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలను అవమానకరంగా చూపించేలా రూపొందించిన వీడియోపై వైస్సార్‌సీపీ సోషల్ మీడియా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఈ మేరకు తిరుపతి ఈస్ట్, అలిపిరి, వెస్ట్, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను అందజేశారు. వీడియోను రూపొందించి, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులను గుర్తించి, డిజిటల్ ఆధారాలను భద్రపరిచి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు ఇరగం అనిల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామిరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ధామా షణ్ముగం, సోషల్ మీడియా విభాగం నగర అధ్యక్షుడు బచ్చు ప్రకాష్, నేతలు మల్లం రవికుమార్‌రెడ్డి, స్వరూప్, కోటి, డేరంగుల బాలాజీ, రమణారెడ్డి, సాయి రాకేష్, చరణ్ పాల్గొన్నారు.


