అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

స్విమ్స్‌లో ఉద్యోగాలకు రేట్లుఫిక్స్‌ చేసేశారా..?

అన్ని పోస్టులను బేరం పెట్టేశారా..?

రూ.10లక్షల నుంచి రూ.లక్షల వరకు ధర కట్టేశారా..?

కీలక ఆధారాలు సేకరించిన విపక్షాలు

భుజాలు తడుముకుంటున్న సూత్రధారులు

విష ప్రచారంపై ఫిర్యాదు
వైఎస్సార్‌సీపీ నేతలను అవమానించేలా వీడియో రూపొందించి వైరల్‌ చేసిన వారిపై పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో మాఫియా రాజ్యం
చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా వనరులను దోచుకుంటున్నారని కిలివేటి ఆరోపించారు.

గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : అవకతవకల నియామకాలకు తాజాగా స్విమ్స్‌ వేదిౖకైంది. ఇటీవల డీఎస్సీలో చేసిన అక్రమాలు, అవినీతి తరహాలోనే మరో దందాకు తెరతీశారు. స్విమ్స్‌లో ఇటీవల విడుదల చేసిన శాశ్వత నియామకాల నోటిఫికేషనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు సమీప బంధువు, ఓ కీలక అధికారి ఆధ్వర్యంలో అక్రమ నియామకాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు బహిరంగంగానే బేరం పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్విమ్స్‌ నియామకాల వ్యవహారంపై పలు కీలక రుజువులు సేకరించిన విపక్ష పార్టీలు వివిధ దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా ఫిర్యాదులు సమర్పించినట్లు సమాచారం. నియామకాల వెనుక అసలు వ్యవహారంపై త్వరలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి తెస్తామని లెఫ్ట్‌ పార్టీలు సైతం వెల్లడిస్తుండడం గమనార్హం.

పశ్నించిన వారికి బెదిరింపులు

నియామక ప్రక్రియను ప్రశ్నిస్తూ ఎవరైనా కాంట్రాక్ట్‌ లేదా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కోర్టును ఆశ్రయించినా, ఆందోళన చేపట్టినా, రాజకీయ నాయకులను కలిసి న్యాయం చేయాలని కోరినా.. వేటు తప్పదని కీలక అధికారి, ముఖ్యమంత్రి బంధువుతో వారి బృందం బెదిరిస్తున్నారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి స్విమ్స్‌లో సేవలందిస్తున్న తమకు ఈ నియామక ప్రక్రియ ద్వారా అన్యాయం జరుగుతోందని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా.. ఉద్యోగం కోసం విప్పలేని దుస్థితి దాపురించిందని వాపోతున్నారు.

వీసీని పక్కనపెట్టి..

స్విమ్స్‌ విశ్వవిద్యాలయానికి డైరెక్టర్‌ కమ్‌ వీసీగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ ఆర్‌వీ కుమార్‌ను పక్కనపెట్టి, పదవీ విరమణ చేసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అధికారికి పోస్టుల భర్తీ బాధ్యతలు అప్పగించడంపై పలువురు మండిపడుతున్నారు. స్విమ్స్‌ 300కు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కమిటీలో ఆ అధికారి, సీఎం బంధువు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమవారికి అనుకూలంగా అర్హతలు

ఇప్పటికే ఏ ఉద్యోగానికి ఏ అభ్యర్థి అని ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లు మా దగ్గర ఉన్నాయంటూ విపక్ష నేతలు వెల్లడిస్తున్నారు. మీడియా కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ పోస్టుకు జేఎన్‌టీయూలో మల్టీమీడియా కోర్సు చేసిన వారికే అర్హత కల్పించినట్లు ఆరోపిస్తున్నారు. యూజీసీ గుర్తింపు పొందిన ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇదే తరహా మల్టీమీడియా కోర్సులు చేసిన అభ్యర్థులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ పోస్టుకు బీటెక్‌ సీఎస్‌ఈ మాత్రమే అర్హతగా పేర్కొనడం, ఐటీ, ఎంసీఏ వంటి విభాగాలను పరిగణనలోకి తీసుకోకపోవడం1పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పోస్టులకు 300, 500 పడకల ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర నిర్దిష్ట ప్రమాణాలను విధించడం వల్ల స్థానికంగా అర్హత కలిగిన అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అర్హులైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శకంగా చేపట్టాలి

స్విమ్స్‌లో ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలి. అభ్యర్థులకు ఎయిమ్స్‌, స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, ఐఏఎం, ఐఐటీ లేదా త్రిబుల్‌ ఐటీ ద్వారా ప్రశ్నపత్రాలు తయారు చేయించి ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి. మార్కులు, వయసుకు సంబంధించిన వెయిటేజ్‌, అనుభవం నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని తుది మెరిట్‌ జాబితాను రూపొందించాలి. ఆ జాబితాను ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ ఆన్‌న్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా ప్రకటించి, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలి. లేకుంటే మరో ఉద్యమం తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

నన్ను ఏవరూ ఏం చేయలేరు

అనుచరులకు అనుకూలంగా నిబంధనలు

సంస్కృతంతో వికసిత్‌ భారత్‌

నేటి నుంచి డిగ్రీ వెబ్‌ ఆప్షన్లు

తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దీంతో ఓఏఎమ్‌డీసీ వైబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు, కళాశాల ఎంపికకు ఈనెల 23వ తేదీ వరకు వెబ్‌ప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 31న తొలివిడత అడ్మిషన్లకు సంబంధించి మెరిట్‌ లిస్ట్‌ విడుదల కానుంది.

తిరుపతి మంగళం : శబరిమలైలో అయ్యప్పస్వామిని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బుధవారం సేవించుకున్నారు. ముందుగా పంపానదిలో పుణ్యస్నానం ఆచరించి కాలినడకన అయ్యప్ప సన్నిధానికి వెళ్లి ఇరుముడి చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు.

భూమన

ప్రెస్‌మీట్‌తో

ఉలిక్కిపడి

చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చట ఉద్యోగాలను అమ్మబడును అంటూ బహిరంగంగానే బేరం పెట్టేస్తున్నారు. ఇప్పటికే డీఎస్సీ పేరుతో వేలాది పోస్టులను అనుచరులకు కట్టబెట్టేశారు. తాజాగా స్విమ్స్‌ ఆస్పత్రిలో నియామకాలకు సంబంధించి అవినీతి తెరతీసేశారు. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్‌తోనే అక్రమాలకు రంగం సిద్ధం చేసేశారు. ఒక్కో ఉద్యోగానికి పక్కాగా రేట్లను నిర్ణయించేశారు. అర్హులకు మొండిచేయి చూపించి.. అనర్హులను అందలం ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఈ అవకతవకల వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించినట్లు విపక్ష పార్టీల నేతలు వెల్లడిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తామని

స్పష్టం చేస్తున్నారు.

స్విమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం సమీప బంధువు, కీలక అధికారి బృందం కుట్రపూరితంగా ప్రభుత్వ నిబంధనలను తమ వారికి అనుకూలంగా నిబంధనలు మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐవీ సుబ్బారావు కమిటీ ఏళ్ల క్రితమే స్విమ్స్‌ ఉద్యోగాల నియామక విధానం, విద్యార్హతలు, అనుభవం, తదితర అంశాలను స్పష్టంగా నిర్దేశించింది. ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కి, తమకు కావాల్సిన వారికి అనుకూలంగా నిబంధనలను మార్చేసినట్లు సమాచారం.. సిమ్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్లు, సిలబస్‌ మొత్తం వారికి కావాల్సినట్టు ఉంచడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశ, రాష్ట్రస్థాయి నిపుణులను సంప్రదించి సిలబస్‌, ప్రశ్నపత్రం తయారు చేయించడం పక్కనపెట్టి ఎవరైతే ఉద్యోగాలను ఆశిస్తున్నారో వాళ్లే సిలబస్‌ తయారుచేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలోనే ఉద్యోగ విరమణ చేయబోతున్న సీఎం సమీపం బంధువు నోటిఫికేషన్‌లోని అర్హతల మార్పుపై ప్రశ్నించిన వారిపై ఒంటికాలుపై లేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్విమ్స్‌లో చర్చ నడుస్తోంది. నన్నెవరూ ఏం చేయలేరు.. ముఖ్యమంత్రి మా బంధువు అంటూ ధీమాతో వ్యవహరిస్తూ పోస్టులకు బేరాలు పెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బెదిరింపులకు భయపడేదిలేదని లెఫ్ట్‌ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.. అధికారం శాశ్వతం కాదని, ఉద్యోగ విరమణ పొందినా విచారణ తప్పదని హెచ్చరిస్తున్నాయి. చంద్రబాబు బంధువు వ్యవహారంలో టీటీడీ విజిలెన్స్‌ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తున్నాయి. స్విమ్స్‌ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టకపోయినా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థల ద్వారా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేస్తున్నాయి.

స్విమ్స్‌లో నియామకాలకు సంబంధించి అవకతవకలపై వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ప్రెస్‌ మీట్‌ పెట్టిన తర్వాత అసలు సూత్రధారులు ఉలిక్కిపడ్డారు. సిలబస్‌, పరీక్షలు ఇవన్నీ దరఖాస్తు స్వీకరణ తర్వాత చూసుకుంటాం అంటూ మాట మార్చేస్తున్నారు. వాస్తవానికి నోటిఫికేషన్‌తో పాటు సిలబస్‌ను విడుదల చేశారు. ఆ సిలబస్‌ని తయారు చేసింది మొత్తం అధికారపార్టీ అనుకూలురే. భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నించకపోతే ప్రశ్న పత్రాలను కూడా వారే తయారు చేసేవారు. స్టేట్‌ హాస్పిటల్‌, స్టేట్‌ యూనివర్సిటీ అయిన స్విమ్స్‌ ఉద్యోగాలుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విభజించారు. సాంకేతికపరమైన, వైద్యపరమైనటువంటి వ్యక్తులు పోటీలో ఉండాలంటే రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement