స్థానిక సమరానికి సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి సన్నాహాలు

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

తిరుపతి అర్బన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ వెంకటేశ్వ్‌ తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనీల్‌చంద్ర పునేఠా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. తిరుపతి కలెక్టరేట్‌ నుంచి జిల్లా పరిస్థితులను కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వివరించారు. జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. అయితే 16 పంచాయతీలకు సంబందించి కోర్టు కేసులు నడుస్తున్నాయన్నారు. వీటిని మినహాయించి మిగిలిన 791 పంచాయతీల్లో ఎన్నికల కోసం నోటీసులు ప్రచురణ ప్రక్రియ పూర్తిచేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 6 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయని, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఎన్నికలకు ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. మిగిలిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement