చంద్రగిరి: చంద్రగిరిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కేంద్ర వైద్య బృందం సందర్శించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వ్యాధికి ఒక కోడ్‌ను ప్రకటించారు. ఇందులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు తన బృందంతో చంద్రగిరి ఆస్పత్రిని సందర్శించారు. ఎన్‌సీడీ జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసర్ రెడ్డి ప్రసాద్, డీఎంహెచ్‌ఓ కార్యాలయ స్యాటికల్ ఆఫీసర్ నాగేంద్రకుమార్, స్థానిక వైద్యులు మురళీమోహన్, పవన్‌కుమార్, స్టాఫ్ నర్స్ కళావతి పాల్గొన్నారు.


