వాయల్టీ అధ్యక్షుడిగా ప్రసాద్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

వాయల్టీ అధ్యక్షుడిగా ప్రసాద్‌రెడ్డి

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

తిరుపతి కల్చరల్‌: వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లైసెన్స్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ (వాయల్టీ) రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన మట్లి ప్రసాద్‌రెడ్డి ఎన్నికయ్యారు. ది అసోసియేషన్‌ ఆఫ్‌ ప్లానర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌(టేప్‌) ఆధ్వర్యంలో ఆదివారం ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడితో పాటు చైర్మన్‌గా కె.హరికప్రసాద్‌ (శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా పీవీఎన్‌.మాణిక్యాలరావు(ఏలూరు), కోశాధికారిగా ఎస్‌కే.హిదయతుల్లా(నెల్లూరు) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం టేప్‌ ఎక్స్‌పో–2026 బ్రోచర్‌ను విడుదల చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, యాద సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, వన్నెకుల క్షత్రియ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీఆర్‌ రాజన్‌, క్రెడాయ్‌ అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement