●
‘‘విద్యార్థుల హక్కుల పరిరక్షణకే సంఘాలు ఏర్పడ్డాయి. విద్యాసంస్థల అవకతవకలపై ఏళ్ల తరబడి పోరాటం సాగిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు.. పిల్లలకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు నిత్యం శ్రమిస్తున్నాయి. అయితే విద్యార్థి సంఘాల చిత్తశుద్ధిని చంద్రబాబు సర్కారు అవమానిస్తోంది. కార్పొరేట్లకు అండగా నిలుస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విద్యాసంస్థలు, వసతిగృహాల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకూడదంటూ హుంకరిస్తోంది. ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. మా ఆశయాలకు కళ్లెం వేయాలని యత్నిస్తే కలబడతాం. ఆంక్షలు విధిస్తే ఉద్యమిస్తాం. మంత్రి లోకేష్ విపరీత వైఖరిని అడుగడుగునా ఎండగడతాం’’ అంటూ విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. – తిరుపతి సిటీ


