అండర్–17బాలుర వంద మీటర్ల పరుగుపందెంలో బి.రెతీష్, డి.మనోజ్‌కుమార్, వి.సిద్ధు, బి.మహేంద్ర, 800మీటర్ల పరుగు పందెంలో ఎం.చంద్రశేఖర్, పి.భువన్‌కృష్ణ, పి.చాణక్యవెంకట్, అండర్–17 జావెలిన్ త్రో బాలుర విభాగంలో డి.ప్రవీణ్‌కుమార్, లాంగ్ జంప్‌లో బి.రెతీష్, ఎస్.ఇమ్రాన్, షాట్‌పుట్‌లో బి.ప్రణీత్‌కుమార్, కె.షెయోన్‌సన్నీ, హైజంప్‌లో సీహెచ్.విష్ణువర్థన్, కె.విష్ణువర్థన్‌రెడ్డిగెలుపొందారు.
అండర్–17బాలికల వంద మీటర్ల పరుగుపందెంలో ఎన్‌వీ స్నేహస్నిగ్ధ, ఎం.జయశ్రీ, జి.దామిని, 800 మీటర్ల పరుగు పందెంలో డి.సోనాక్షి, ఎల్.అలేఖ్య, కె.పల్లవి, లాంగ్ జంప్‌లో బి.షర్మి, ఎన్.సాహితి, హైజంప్‌లో ఎన్‌వీ స్నేహస్నిగ్ధ, కె.శివాని, షాట్‌పుట్‌లో పి.నిత్యహాసిని, ఎం.సహస్ర చౌదరి గెలుపొందారు.
అండర్–23 బాలికల 800మీటర్ల పరుగు పందెంలో యు.నిఖిల, ఎం.అశ్విత, వంద మీటర్ల పరుగు పందెంలో డి.చిద్విలాసిని, డి.యోక్షిత, జావెలిన్ త్రోలో యు.నిఖిల, లాంగ్ జంప్‌లో ఎస్‌డీ నజుని, కె.అశ్వని, హైజంప్‌లో ఎస్‌డీనజుని, షాట్‌పుట్‌లో ఎస్‌కే ఫాతిమా, ఎం.గంగాసురేఖ, 5 కి.మీల పందెంలో ఎం.స్పందన, 400మీటర్ల పరుగు పందెంలో ఎ.కావ్య గెలుపొందారు.
అండర్–23 బాలుర విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో డి.సింధూర్, వి.అశోక్, వంద మీటర్ల పరుగు పందెంలో ఈ.రాఘవేంద్ర, ఎ.వినయ్, జావెలిన్ త్రోలో అమ్రేష్, లాంగ్‌జంప్‌లో ఎల్.ఖాదర్‌హుస్సేన్, ఆర్.ప్రేమ్‌సాయి, షాట్‌పుట్‌లో జె.వేణుమాదవ్, వి.నాగమహేష్, 5కి.మీల పందెంలో సి.తిమ్మప్ప, ఎన్.పెంచలయ్య, 400మీటర్ల పరుగు పందెంలో ఈ.రాఘవేంద్ర విజయం సాధించారు.
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆదివారం అమరావతి చాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ స్కూల్ ఆవరణలో తొలిరోజు వాలీబాల్, ఎస్వీయూ క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కలెక్టర్ వెంకటేశ్వర్, శాప్ చైర్మన్ రవినాయుడు, శాప్ బోర్డు సభ్యులు రజని, డీఎస్‌డీఓ శశిధర్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒకరు క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. తిరుపతి, చంద్రగిరి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఇదివరకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన 1,538 క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. 10వ తేదీన బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో, బాస్కెట్ బాల్‌ను ఎస్వీయూ మైదానంలో, 11న బాక్సింగ్, చెస్ పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో, హాకీ క్రీడను ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో, 12న ఖోఖో, కబడ్డీ పోటీలను ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో, యోగా పోటీలను శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో, ఆర్చరీ పోటీలను ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులందరూ తమ ప్రతిభను చాటుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి విజేతలు ఈ నెల 19నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, శాప్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యేతో కలిసి వాలీబాల్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు.
జిల్లా స్థాయి విజేతలు వీరే..


