మట్టి దోపిడీకి ‘హైవే’ | - | Sakshi
Sakshi News home page

మట్టి దోపిడీకి ‘హైవే’

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ పోరుబాట డీఎస్సీలో అవినీతిపై సీబీఐ విచారణ చేయాల్సిందే.. యువతను వంచించిన మంత్రి లోకేష్‌ రాజీనామాకు డిమాండ్‌ నిరుద్యోగ భృతి పేరిట మోసానికిబాధ్యత వహించాల్సిందే.. వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించడంలో బాబు సర్కారు వైఫల్యం రిలే నిరాహార దీక్షలో పెద్దిరెడ్డి, భూమన

చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చెట్టేవారిపాళెం వద్ద జాతీయ రహదారి పక్కన మట్టి దోపిడీ సాగుతోంది.
ఎస్వీయూలో కారు బోల్తా
ఎస్వీయూలోని ఇంజినీరింగ్‌ హాస్టల్‌కు వెళ్లే మార్గం వద్ద గురువారం అర్ధరాత్రి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు బోల్తా పడింది.
రౌడీయిజానికి భయపడం

● వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలు హాజరై డీఎస్సీలో అవినీతిపై గళమెత్తారు.

● రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు.

● సత్యవేడులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026

‘‘వంచనకు మారు పేరు చంద్రబాబు.. అదే బాటలో నయా మోసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు నారా లోకేష్‌. ఎన్నికల సమయంలో నోటికొచ్చినట్లు హామీలు గుప్పించారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తమ సహజ నైజం ప్రదర్శిస్తున్నారు. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ పేరిట టోపీ పెట్టారు. ఉద్యోగాలను రూ.లక్షలకు అమ్ముకున్నారు. అనర్హులకు పోస్టులు కట్టబెట్టారు. భావి పౌరుల జీవితాలను దెబ్బతీసేందుకు సైతం తెగబడ్డారు. సీబీఐ విచారణ జరిపించమంటే చేతులెత్తేస్తున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలంటూ యువతను దగా చేశారు. భృతి పేరుతో మరో అన్యాయం చేసేశారు. విద్యావ్యవస్థను నాశనం చేసిన మంత్రి లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు సైతం నైతిక బాధ్యత వహించాలి’’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.

తిరుపతి మంగళం/ తిరుపతి సిటీ : ఎన్నికల సమయంలో ఓట్ల కోసం యువతను నమ్మించి, మోసం చేసిన ద్రోహి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహారదీక్షకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ 16వేల డీఎస్సీ ఉద్యోగాలను టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టి, పేద బిడ్డల జీవితాలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుంటే చంద్రబాబు, లోకేష్‌ మాత్రం సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో వైఎస్‌ జగన్‌పై ప్రతిపక్షాలు అభియోగాలు మోపితే అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. ప్రస్తుత మెగా డీఎస్సీలో అవినీతికి పాల్పడకుండా ఉంటే లోకేష్‌పై సీబీఐ విచారణ జరిపించేందుకు చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. భూమన మాట్లాడుతూ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు, అరాచకాలు, దాడులు, అక్రమ కేసుల తప్ప యువతకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. మెగా డీఎస్సీలో అర్హులను కాదని, ఒక్కో పోస్టును రూ.30లక్షల చొప్పున అనర్హులకు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ విద్యాశాఖకు లోకేష్‌ మాయని మచ్చ తెచ్చారని మండిపడ్డారు. టీచర్‌ ఉద్యోగాలలో అవకతవకలకు పాల్పడి, విద్యార్థుల భవితతో చెలగాటమాడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో సైతం చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా బేఖాతర్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతిలో చేపట్టిన దీక్షలో పెద్దిరెడ్డి, భూమన, అభినయ్‌రెడ్డి, శిరీష తదితరులు

రేషన్‌ కందిపప్పు కట్‌

తిరుపతి అర్బన్‌ : చౌకదుకాణాల్లో కంది పప్పు పంపిణీని ప్రభుత్వం దాదాపు కట్‌ చేసింది. అదిగో ఇదిగో అంటూ అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ ఈ నెలలోనూ కార్డుదారులకు కందిపప్పును పంపిణీ చేయలేదు. ఈ క్రమంలోనే ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకుకార్డు దారులకు బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే డీలర్లు 10వ తేదీకే బియ్యం పంపిణీ నిలిపేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. 15వ తేదీ వరకు బియ్యం పంపిణి చేసేలా సివిల్‌ సప్లయి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారని మండిపడుతున్నారు. 26 నెలలుగా బియ్యం, అరకొరగా చక్కెర మాత్రమే ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి ఐఐటీలో ‘ఇన్‌స్పైర్‌ వర్క్స్‌’’

ఏర్పేడు : కియా ఇండియా, తిరుపతి ఐఐటీ ‘ఇన్‌స్పైర్‌ వర్క్స్‌’ ల్యాబ్‌ను శుక్రవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ప్రారంభించారు. ఏడాది తమ రెండు సంస్థల భాగస్వామ్య ఒప్పందం ఒక మైలురాయికి చేరుకుందని కియా ఇండియా సీఈఓ తాయ్‌హ్యూన్‌ కిమ్‌, తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. విద్యార్థుల అభ్యాసానికి, వాస్తవ ప్రపంచ అనువర్తనాలకు మధ్య వారధిగా నిలుస్తూ, తమ ఆలోచనలను రూపొందించుకోవటానికి ఈ ల్యాబ్‌ దోహదం చేస్తుందని వెల్లడించారు. ఐదేళ్ల కాలపరిమితిలో రూ.25కోట్లు భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమొబైల్స్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ ల్యాబ్‌ ద్వారా యువ ఇంజినీర్లు తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలచుకోగలిగే ఒక వ్యవస్థను సృష్టిస్తున్నట్లు స్పష్టం చేశారు. కియా ఇండియా కార్పొరేట్‌ అఫైర్స్‌ హెడ్‌ జుంగ్‌హో ఆన్‌, హాంగ్‌సుంగ్‌ పార్క్‌, గ్యున్‌బమ్‌ కిమ్‌, తిరుపతి ఐఐటీ డీన్‌ ప్రొఫెసర్‌ సురేష్‌ జైన్‌, మేకర్స్‌ ల్యాబ్‌ ఇన్‌న్‌చార్జి డాక్టర్‌ డీవీ కిరణ్‌ పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 66,842 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,670 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది.

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో బజారు రౌడీకి టీడీపీ ఇన్‌చార్జి పదవు కట్టబెట్టి అరాచకాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపక్షంలో ఉండేవారు రాజకీయాల్లోకి వస్తే మంచి ప్రవర్తన ఉంటుందన్నారు. గూండాలకు పదవులిస్తే వారు రౌడీయిజానికే దిగుతారని విమర్శించారు. టీడీపీ గూండాల అరాచకాలను వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ అరాచకశక్తులను టీడీపీ పెంచిపోషిస్తోంన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ గూండాలు లోకేష్‌ ఆదేశాలతో స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు. నేరాలకు పాల్పడుతూ తిరుపతి ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఈ క్రమంలోనే హత్యకు పాల్పడిన నిందితులను టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌ కాపాడుతున్నారని ఆరోపిస్తూ హతుడి భార్య నిరసన చేపడితే, కవరేజ్‌కు వెళ్లి రిపోర్టర్‌ సునీల్‌ను చితకబాదారని మండిపడ్డారు. అతడితోపాటు వెళ్లిన సాక్షి ఫొటోగ్రాఫర్‌ మోహన్‌కృష్ణపై హత్యాయత్నం నేరం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రంతా పోలీసులు సాక్షి ఫోటోగ్రాఫర్‌ మోహన్‌కృష్ణ ఇంటి వద్ద హల్‌చల్‌ చేశారని తెలిపారు. అలాగే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలేనిరాహారదీక్షలో ఉన్న పార్టీ నాయకుడు ఇరగం అనీల్‌రెడ్డి, బీసీ నాయకుడు వాసుయాదవ్‌లపై కూడా హత్యాయత్నం నేరాలు మోపారని, ఇదే వారి దుర్మార్గాలకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రేమ్‌కుమార్‌ అనే దళిత యువకుడిపైనా హత్యాయత్నం నేరం కేసు పెట్టారన్నారు. టీడీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాయడం దారుణమని మండిపడ్డారు. బెదిరంపులతో వైఎస్సార్‌సీపీని బలహీనం చేయాలనుకుంటే అది టీడీపీ నేతల తరం కాదని స్పష్టం చేశారు. పోలీసులు సైతం బాధితుల ఫిర్యాదు తీసుకోకుండా దాడి చేసినవాళ్ల ఫిర్యాదు తీసుకుని అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండో రిలే నిరాహార దీక్షను కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షలకు ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు సంఘీభావం తెలిపారు.

వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. నాయుడుపేటలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. మెగా డీఎస్సీని రద్దు చేసి తిరిగి నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement