ఇసుక తరలిస్తున్న కంటైనర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక తరలిస్తున్న కంటైనర్లు సీజ్‌

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

● రైల్యే కోడూరు : వైఎస్సార్‌సీపీ రైల్వేకోడూరు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. సుమారు 200 మంది పాల్గొన్నారు. ● నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఆందోళన ● జిల్లాలో జెన్‌జీ వార్‌ రిలే నిరాహారదీక్షలకు పోటెత్తిన నేతలు, కార్యకర్తలు ● మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే : భూమన ● సూళ్లూరుపేట : వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రిలేనిరాహా దీక్ష నిర్వహించారు. నాయుడుపేటలో ప్రారంభించిన దీక్షకు సుమారు 350 మంది కార్యకర్తలు హాజరయ్యారు. – 8లో ● తిరుపతి : వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయ కర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సుమారు 450 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తొలిరోజు నిరాహార దీక్ష విజయవంతం కావడంపై కూటమి నేతలలో గుబులు మొదలైంది. ● సత్యవేడు : వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సుమారు 250 మంది పాల్గొన్నారు. ● వెంకటగిరి : వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు హాజరై డీఎస్సీ అవినీతిపై గళమెత్తారు. ● చంద్రగిరి : వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్‌ క్లాక్‌ వద్ద రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఆరు మండలాల నుంచి 500మందికిపైగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ప్రారంభించారు. డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

– 8లో

న్యూస్‌రీల్‌

శ్రీకాళహస్తి:వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజ కవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. సుమారు 450 మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రేణిగుంట కేంద్రంగా ఓ టీడీపీ నేత సాగిస్తున్న ఇసుక దందాకు పోలీసులు గురువారం చెక్‌ పెట్టారు. వాహనాలన సీజ్‌ చేశారు.

మెగా డీఎస్సీలో అక్రమాలను నిలదీసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

అవినీతి వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్‌

శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026

నిరసన తెలుపుతున్న భూమన తదితరులు

తిరుపతిలోని దీక్ష శిబిరంలో భూమన, అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్‌ శిరీష తదితరులు

నాయుడుపేటలో

సోలార్‌ సెల్‌ ప్లాంట్‌

తిరుపతి అర్బన్‌ : నాయుడుపేట సెజ్‌లో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ 7 గిగావాట్ల సోలార్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ ప్రారంభంకానుందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో సోలార్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ ప్రతినిధులు రేవతి రోహిణి, సుధీర్‌రెడ్డి, రమేష్‌ నాయుడుతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రూ.3వేల కోట్లతో నిర్మిస్తున్న ప్లాంట్‌ ద్వారా 4,500 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ప్లాంట్‌కు విద్యుత్‌తోపాటు అన్ని వసతులు కల్పిస్తూ పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయభరత్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఐ రాజా నాయక్‌ పాల్గొన్నారు.

సిరులతల్లి సేవలో

వ్యాసరాజ పీఠాధిపతి

చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మైసూరు వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీవిద్యా మనోహర తీర్థ స్వామీజీ గురువారం సేవించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.

17న లా పరీక్షల నిర్వహణ

తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో బుధవారం బంద్‌ కారణంగా వాయిదా పడిన 3, 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ పరీక్షలను ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అన్ని కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

ఎన్నడూ లేని విధంగా దాడులు

తిరుపతి కల్చరల్‌: తిరుపతిలో టీడీపీ ఇన్‌చార్జ్‌గా జేబీ శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న సంఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న వారిపై దాడులకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం దుర్మార్గని తెలిపారు. సంఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. టీడీపీ తిరుపతి ఇన్‌చార్జ్‌ జేబీ వెంటనే బాధితులు, మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.

నిరసన గళం..

‘‘యువతను చంద్రబాబు నిలువునా వంచించారు. మెగా డీఎస్సీ పేరుతో దారుణంగా దగా చేసేశారు. కష్టపడి చదివి అర్హత సాధించిన వారికి తీరని అన్యాయం చేశారు. అనర్హులను అందలం ఎక్కించి విద్యార్థుల భవితను బలిపెట్టేందుకు తెగబడ్డారు. మొత్తం అవినీతి వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలకపాత్రం పోషించారు. వేలాది మంది జీవితాలతో ఆటలాడినందుకు నైతిక బాధ్యత వహించకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ప్రజా కంటక పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భృతి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించకుండా నిరుపేద తల్లిదండ్రులను అప్పుల పాలు చేసేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మండిపడ్డారు. బాబు సర్కారు వైఖరికి నిరసనగా గళమెత్తారు. గురువారం ఈ మేరకు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

తిరుపతి సిటీ : బాబు సర్కార్‌పై ఇక సమరమే అంటూ వైఎస్సాఆర్‌సీపీ శ్రేణులు గళం విప్పాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో గురువారం జెన్‌జీ వార్‌ పేరుతో రిలే నిరాహారదీక్షలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, మండల స్థాయి నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై డీఎస్సీ అక్రమాలపై సర్కారును నిలదీశారు. తక్షణం మెగా డీఎస్సీలో అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని, నిజాలు నిగ్గుతేల్చాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని నినదించారు.

బాధ్యత వహించాల్సిందే..

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. అదే విధంగా డీఎస్సీలో అవినీతికి పూర్తి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్‌ రాజీనామా చేసి తీరాల్సిందేనని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగిరి నియోజకవర్గాలలో వైఎస్సాఆర్‌సీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలలో ఆయన పాల్గొన్నారు. భూమన మాట్లాడుతూ నీట్‌ కంటే అతిపెద్ద కుంభకోణం మెగా డీఎస్సీలో జరిగిందని, టీడీపీ తొత్తులకే ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. అర్హతలేని వారు గురువులుగా వస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమేనని విమర్శించారు. ఏడాదికి నాలుగు లక్షల చొప్పున 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన బాబు సర్కార్‌కు పాలించేఅర్హత లేదన్నారు. నిరుద్యోగ భృతి, ఫీజురీయింబర్స్‌ మెంట్‌, వసతిదీవెన బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement