ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఘన స్వాగతం

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

రేణిగుంట : జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానాకు ఎంపీ గురుమూర్తి ఘనంగ స్వాగతం పలికారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, ప్రోటోకాల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శివ శంకర్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి ఆహ్వానం పలికారు. అంబేద్కర్‌ భవన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పరమశివన్‌, గాలి రవి, పీఎం చంద్ర, మాజీ సర్పంచులు మునిశేఖర్‌, నగేశం, శరవణ, శ్రీహరి, సురేష్‌ పాల్గొన్నారు.

జ్యువెలరీ వ్యాపారులూ అప్రమత్తం

తిరుపతి క్రైమ్‌ : బంగారం ధరలు ఆకాశన్నంటిని నేపథ్యంలో జ్యువెలరీ, పాన్‌ బ్రోకర్‌ దుకాణాల యజమానులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ (అడ్మిన్‌) శ్రీనివాసులు సూచించారు. గురువారం తిరుపతి సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌న్‌లో జ్యువెలరీ, పాన్‌ బ్రోకర్‌ దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా షాపుల వద్ద భద్రతా చర్యలు, పోలీసు–వ్యాపారుల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. పోలీస్‌ అధికారులు మాట్లాడుతూ ప్రతి జ్యువెలరీ, పాన్‌బ్రోకర్‌ దుకాణంలో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని కోరారు. ప్రతి లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయడంతో పాటు, బంగారం విక్రయించే లేదా తాకట్టు పెట్టే ప్రతి వ్యక్తి గుర్తింపు పత్రాలను (కేవైసీ) తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, లావాదేవీలు లేదా చోరీ సొత్తు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. చోరీ నగలను కొనుగోలు చేయడం, తాకట్టు పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. జ్యువెలరీ, పాన్‌ బ్రోకర్‌ దుకాణాల యజమానులు మాట్లాడుతూ నేరాల నివారణలో పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేస్తూ అన్ని భద్రతా నిబంధనలను పాటించి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ప్రాణదానానికి 417మంది ఎంపిక

తిరుపతి తుడా : టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్‌ ఆస్పత్రిలో పేద రోగులకు ఉచితంగా నిర్వహించే శస్త్ర చికిత్సలకు 417మంది ఎంపికై నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌వీ కుమార్‌ తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో స్విమ్స్‌ డైరెక్టర్‌తో పాటు పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, స్విమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ కోటిరెడ్డి, బర్డ్‌ హాస్పిటల్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ రామ్మూర్తి, రుయా, మెటర్నటీ హాస్పిటల్‌ అధికారులు సుబ్బలక్ష్మి, శ్రీనివాసులు పాల్గొని అర్హులైన రోగులను ఉచిత శస్త్ర చికత్సలకు ఎంపిక చేశారు.

ఆత్మహత్య కేసులో

నిందితుల అరెస్ట్‌

తడ : అప్పు వసూలు విషయంలో ఎస్‌కే మస్తాన్‌ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించిన కేసులో బీవీపాళెం గ్రామానికి చెందిన గఫూర్‌, అతడి కుమారుడు ఇక్బాల్‌ను తడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీన మృతుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని నిందితులు పరారయ్యారు. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఎస్‌ఐ కొండపనాయుడు ఆధ్వర్యంలోని పోలీసుల పట్టుబడ్డారు. సూళ్లూరుపేట మెజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశ పెట్టడంతో నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు

తిరుపతి లీగల్‌ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన అశోక్‌ కుమార్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి గురువారం తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement