ఇన్–సర్వీస్ సబ్జెక్టు టీచర్లకు వారు బోధిస్తున్న సబ్జెక్టుల్లోనే టెట్ పరీక్షను నిర్వహించాలి. వారు బోధించే సబ్జెక్టుతో పాటు ఇతర సబ్జెక్టుల్లోను టెట్ పరీక్షల్లో ప్రశ్నలుండడం వారికి నష్టం వాటిల్లుతుంది. సబ్జెక్టు టీచర్లకు ఆ సబ్జెక్టులోనే పరీక్షను నిర్వహించాలి.
–బుక్కే నాగరాజునాయక్, తెలుగు ఉపాధ్యాయులు,
మునగలపాళెం, ఏర్పేడు మండలం
ఆఫ్‌లైన్లోనూ నిర్వహించాలి
చాలా మంది సీనియర్ టీచర్లకు సాంకేతిక పరిజ్ఞా నం తక్కువ. టెట్ పరీక్షకు సాధారణ అభ్యర్థులతో పాటు ఇన్–సర్వీసు టీచ ర్లు రాస్తున్నారు. అయితే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం ఆన్‌లైన్‌తో పాటు అవసరమైన వారికి ఆఫ్‌లైన్లో నిర్వహించాలి. –సీహెచ్.శ్రీనివాస్‌యాదవ్,
జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ
రెండు సార్లు ఓడీకి ఉత్తర్వులివ్వాలి
ఇన్–సర్వీసు టీచర్లందరూ టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉపా ధ్యాయులు టెట్ పరీక్షకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ టెస్టులు రాసేందుకు సర్వీసులో రెండుమార్లు సౌకర్యం కల్పించినట్లుగానే టెట్ రాసే ఇన్–సర్వీస్ టీచర్లకు రెండు మార్లు ఓడి సౌకర్యం కల్పించాలి.
– దళవాయి సురేష్, హెచ్‌ఎం, మోడల్ ప్రైమరీ
స్కూల్, అప్పలాయగుంట, వడమాలపేట మండలం
చట్ట సవరణ చేయాలి
టెట్ పరీక్ష రాకముందే ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇప్పుడు టెట్ అర్హత కావాలి అంటున్నారు. ఇన్–సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి చట్ట సవరణ చేసేలా కృషి చేయాలి.
– బి.మహేష్‌కుమార్, ఎస్‌జీటీ,
తిరుచానూరు ఈస్ట్ ఎంపీపీఎస్ స్కూల్


