సీఎంఏ ఇంటర్‌లో సాత్వికకు 22వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

సీఎంఏ ఇంటర్‌లో సాత్వికకు 22వ ర్యాంకు

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

బుచ్చినాయుడుకండ్రిగ: బుచ్చినాయుడుకండ్రిగ గ్రామానికి చెందిన విద్యార్థిని సీఎంఏ ఇంటర్‌ ఫలితాల్లో 22వ ర్యాంకు సాధించింది. బుచ్చినాయుడుకండ్రిగకు చెందిన సముద్రాల సుధాకర్‌నాయుడు, సునీతమ్మ దంపతుల కుమార్తె సాత్విక సీఎంఏ ఇంటర్‌లో 22వ ర్యాంకు సాధించింది. గతంలో సీఎంఏ పౌండేషన్‌లో 336 మార్కులతో 10వ ర్యాంకు సాధించగా, సీఏ పౌండేషన్‌లో 316 మార్కులు, సీఏ ఇంటర్‌లో 410 మార్కులతో ప్రతిభ కనపరిచింది. దీంతో సాత్వికను గ్రామస్తులు అభినందించారు.

సివిల్స్‌లో సత్తా చాటుతా

సివిల్స్‌లో సత్తా చాటి, ఐ ౌఎస్‌ కావడమే నా లక్ష్యం,. ఐ ౌఎస్‌ సాధించి ప్రజాసేవ చేయడం కోసమే అడుగులు వేస్తున్నాను. ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కరించగలితే అప్పుడు వచ్చే గుర్తింపు, ఆత్మ సంతృప్తి ఆనందాన్ని కలిగిస్తుంది. చుట్టూ ఉన్న వారికి సేవ చేయాలంటే ఐఏఎస్‌ ఉత్తమమైన ఎంపిక అని నాన్న చెప్పడంతో అప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. అ లక్ష్యం చేరేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నా. ఐఏఎస్‌ సాధించి ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తా.

– తల్లిదండ్రులు, అక్కతో సాత్విక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement