‘అపోలో’లో వెరికోస్‌ వెయిన్స్‌కు చికిత్స | - | Sakshi
Sakshi News home page

‘అపోలో’లో వెరికోస్‌ వెయిన్స్‌కు చికిత్స

Jul 27 2026 12:42 AM | Updated on Jul 27 2026 12:42 AM

తిరుపతి తుడా : రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే తీవ్రమైన వెరికోస్‌ వెయిన్స్‌ సమస్యలను నివారించవచ్చని చైన్నె అపోలో ఆస్పత్రి డాక్టర్‌ బాలాజీ తెలిపారు. ఆదివారం స్థానిక తుడా రోడ్డులోని అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయన మాట్లాడారు. వాస్కులర్‌ వ్యాధుల లక్షణాలు, ఆధునిక చికిత్సను వివరించారు. కాళ్లలోని సిరలు ఉబ్బి, మెలికలు తిరిగి కనిపించడాన్ని వెరికోస్‌ వెయిన్స్‌ అంటారని, ఎక్కువసేపు నిలబడి పనిచేసే పోలీసులు, బస్సు కండక్టర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, మహిళల్లో ఇది సాధారణంగా ఉంటుందన్నారు.పెద్ద ఆపరేషన్‌ అవసరం లేకుండా లేజర్‌ పద్ధతితో చికిత్స చేయవచ్చని వెల్లడించారు. మందులు, ఇంజెక్షన్లు, అవసరమైతే ఐవీసీ ఫిల్టర్‌ ద్వారా చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. షుగర్‌, బీపీ, కొలెస్ట్రాల్‌తోపాటు ధూమపానం చేసేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాళ్ల నొప్పి, వాపు, నరాలు ఉబ్బడం, నడిచినప్పుడు నొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలన్నారు. అపోలో ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అధునిక చికిత్సను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement