కళా వికాసంతో సమాజ శ్రేయస్సు | - | Sakshi
Sakshi News home page

కళా వికాసంతో సమాజ శ్రేయస్సు

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

తిరుపతి కల్చరల్‌ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మార్గదర్శకమైన కళల వికాసంతో సమాజ శ్రేయస్సు సాధ్యమని, ఆ దిశగా కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. ఈనెల 18 నుంచి తొమ్మిది రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి శాసీ్త్రయ, జానపద నృత్యాలు, పౌరాణిక, పద్యనాటక పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా హనుమా అవార్డులు, బహుమతి ప్రధానోత్సవానికి టీటీడీ ఈఓ రవిచంద్ర, ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, టీటీడీ విశ్రాంత డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, డాక్టర్‌ లింగుట్ల రమేష్‌నాథ్‌, డాక్టర్‌ మేడసాని మోహన్‌ విచ్చేశా రు. గత 26 ఏళ్లుగా క్రమం తప్పకుండా కళాకారును ప్రోత్సహిస్తున్న అభినయ ఆర్ట్స్‌ బీఎన్‌ రెడ్డి అభినందనీయులని కొనియాడారు. పౌరాణిక పద్యనాటకంలో విజయవాడకు చెందిన రామ ఫౌండేషన్‌ వారు ప్రదర్శించిన ‘ఉషాపరిణయం’ పద్యనాటకం ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన శ్యామలాంబ ఫైన్‌ ఆర్ట్స్‌ వారు ప్రదర్శించిన ‘సీ్త్ర సూక్తం’, ఈజీవీ కళాక్షేత్రం కర్పూలు వారు ప్రదర్శించిన ‘సైరా నరసింహారెడ్డి’ పద్యనాటకాలు ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. అలాగే సాంఘిక నాటిక విభాగంలో గుంటూరు అభినయ ఆర్ట్స్‌ వారు ప్రదర్శించిన ‘ ఇది అతని సంతకం’, వెలగలేరు థియేటర్ట్స్‌ వారు ప్రదర్శించిన ‘నెట్‌’, విశాఖపట్నం తెలుగు కళా సమితి వారు ప్రదర్శించిన ‘ చిటికిన వేలు’ సాంఘిక నాటికలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందాయి . అభినయ ఆర్ట్స్‌ ప్రతినిధులు ఎన్‌.విశ్వనాథ్‌రెడ్డి, మబ్బు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

బీఎన్‌ రెడ్డికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

శాసీ్త్రయ నృత్య, పౌరాణిక నాటకాల ద్వారా యువతలో సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు 26 ఏళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న అభినయ ఆర్ట్స్‌ వ్యవస్థాపక కార్యదర్శి బీఎన్‌ రెడ్డికి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ మేరకు మహతి కళాక్షేత్రంలో ఆయనకు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌ టి. రామకృష్ణారెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ శ్రీరామ్‌బాబు ఆదివారం రికార్డు నమోదు పత్రాలను అందజేశారు. అభినయ ఆర్ట్స్‌ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. విశ్వనాథ్‌రెడ్డి, అధ్యక్షుడు మబ్బు సూర్యనారాయణరెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement