జంట హత్యల కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసులో ముగ్గురి అరెస్ట్‌

Jul 11 2026 1:18 AM | Updated on Jul 11 2026 1:18 AM

తిరుపతి క్రైం: తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపం సమీపంలో ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన జంట హత్యల కేసును తిరుపతి పోలీసులు ఛేదించారు. కుటుంబ వివాదాలే ఈ జంట హత్యలకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నైనర్‌ వాసుదేవయ్య (59), అతని కుమారులు నైనర్‌ సునీల్‌ (32), నైనర్‌ ఉపేంద్ర (30)ను అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తి, మోటార్‌ సైకిల్‌, నిందితులు ధరించిన దుస్తులు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ (లా అండ్‌ ఆర్డర్‌) రవిమనోహరాచారి వెల్లడించిన వివరాల ప్రకారం.. రాఘవేంద్ర నగర్‌కు చెందిన పుచ్చకాయల దీపా ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌న్‌లో కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తేదీ రాత్రి తిరుమలలో వ్యాపారం చేస్తున్న మునిరత్నం అలియాస్‌ మునియాదవ్‌, అతని స్నేహితుడు కె.మణికంఠ కుటుంబ వివాదానికి మధ్యవర్తిత్వం చేసేందుకు పద్మావతి కల్యాణ మండపానికి వెళ్లారు. అక్కడ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వారు తిరిగి వెళ్తుండగా మోటార్‌ సైకిల్‌పై వచ్చిన నిందితులు అడ్డగించి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితులు జంగాలపల్లి నుంచి తిరుపతికి వచ్చి, అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయేందుకు రైల్వే స్టేషన్‌న్‌కు వెళ్తుండగా ఓల్డ్‌ తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement