– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఆప్సీ మనుగడకే ప్రమాదకరంగా
జీఓ నంబర్ 3 విడుదల
చీకటి జీఓలతో కీలక విధుల నుంచి ఆప్సీని తప్పించిన ప్రభుత్వం
ఉన్నత విద్యను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం అడుగులు
ఇక ప్రవేశ పరీక్షలన్నీ కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చేతుల్లోనే
ఆప్సీని డమ్మీ చేయడంపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు
ఎస్వీయూలో జీఓ ప్రతులను దగ్ధం చేసిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులు
సమాజంలో అసమానతల తొలగింపునకు విద్యాజ్యోతి వెలిగించిన మహనీయుడు పూలే అని వక్తలు కొనియాడారు.
వేదనారాయణుడికి ఊంజల్ సేవ
నాగలాపురంలోని వేదనారాయణస్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి ఘనంగా ఊంజల్ సేవ చేశారు.
ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పేదలకు విలువలతో కూడిన విద్య.. అత్యుత్తమ సంస్కారం అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. వారి ఉజ్వల భవితకు సోపానం వేయాలి.. ఇదీ ఎన్టీఆర్ ఉన్నతాశయం.. ఆ ఆశయంతోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఏర్పాటు.. అయితే చంద్రబాబు సర్కారు కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది.. అందుకోసం చీకటి జీఓలు విడుదల చేసింది. వీటితో ఉన్నత విద్యామండలి నిర్వీర్యం కానుంది. ఫలితంగా పేదలకు ఉన్నతవిద్య మిథ్యగా మారనుంది.
ఆప్సీ స్వయం ప్రతిపత్తికి
చరమగీతం
ఆప్సీ స్వయం ప్రతిపత్తికి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం చీకటి జీఓలను తీసుకువస్తోంది. 40 ఏళ్ల కిందట ఎన్టీఆర్ తీసుకువచ్చిన విద్యావ్యవస్థను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. పరీక్షలు, ప్రవేశాలను విడదీయడంతో విద్యావ్యవస్థ పారదర్శకత కోల్పోతుంది. పేద విద్యార్థులను ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోంది. జీఓను రద్దు చేయాలని లేకుంటే తిరుగుబాటు తప్పదు. – చిన్న,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి
పునరాలోచన చేయాలి
ఉన్నత విద్యను పేదల కు అందాలనే ఉన్నతాశయంతో రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆప్సీని స్థాపించారు. కొన్ని దశాబ్ధాలుగా ఉన్నత విద్యామండలి యూనివర్సిటీలను అభివృద్ధి చేసి, లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసించేందుకు తోడ్పాటును అందించింది. కానీ ప్రస్తుతం ఆప్సీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. జీఓ నంబర్ 3 విద్యారంగానికి గొడ్డలి పెట్టువంటిది. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ రమణ,
విశ్రాంత ఆచార్యులు, ఎస్వీయూ
నిర్ణయాన్ని మార్చుకోవాలి
ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లను ఆప్సీ నుంచి వేరు చేసి, మరో వ్యవస్థకు అప్పగించడం ప్రమాదకరం. ఉన్నత విద్యామండలి మనుగడకు ప్రమాదకరమే. వర్సిటీల అభివృద్ధి, పలు పీజీ కోర్సులకు సంబంధించిన ప్రవేశాలపైన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. జీఓను వెనక్కి తీసుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిది. – ప్రొఫెసర్ రాజశేఖర్,
విశ్రాంత ఆచార్యులు, ఎస్వీయూ
జీఓను రద్దు చేయాలని ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న
విద్యార్థి సంఘాల నేతలు
తిరుపతి సిటీ: చంద్రబాబు సర్కార్ చీకటి జీఓలతో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహించడంతో ఇప్పటికే ప్రభుత్వ విద్యావ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే యూనివర్సిటీల్లో పలు కోర్సులను ఎత్తివేయడంతో భారీ స్థాయిలో అడ్మిషన్లు పడిపోయి, వర్సిటీల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఈ దశలో చంద్రబాబు సర్కార్ గుట్టు చప్పుడు కాకుండా ఉన్నత విద్యామండలిపై మరో దెబ్బ వేసింది. 1988లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ఆప్సీని నిర్వీరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది.
ఉన్నత విద్యామండలి ఇక డమ్మీనే!
ధనార్జనే ధ్యేయంగా విద్యారంగాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యామండలి డమ్మీ చేసేందుకు ఇటీవల జీఓ నంబర్–3ని విడుదల చేసింది. ఇందులో కీలక విధుల నుంచి ఉన్నత విద్యామండలిని తప్పించి, కమిషనరేట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్(సీహెచ్‌ఈ) పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేసింది. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షలు (ఏపీ సెట్‌లు) ఇక సీహెచ్‌ఈ కిందకు రానున్నాయి. ఏపీ పీజీసెట్, ఏపీఈఏపీసెట్, ఓఏఎమ్‌డీసీ, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ఇక పూర్తిగా సీహెచ్‌ఈ చేతుల్లోకి వెళ్లనుంది. 40ఏళ్లుగా ఉన్నత విద్యలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఆప్సీ) ఇక డమ్మీగా మిగిలిపోనుంది.
ఉన్నత విద్య మనుగడకే ప్రమాదం
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఉన్నత విద్య మనుగడకే ప్రమాదం. ఉన్నత విద్యామండలిని డమ్మీ చేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే ప్రభుత్వం చీకటి జీఓలను తెస్తోంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గందరగోళంగా తయారైంది. పాలకు లు చేస్తున్న వికృత చేష్టలకు భవిష్యత్తులో పేద విద్యార్థులు బలికావల్సి వస్తోంది. తక్షణం జీవో నంబర్ 3 ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.
– టి వెంకటేష్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర వర్సిటీల కోకన్వీనర్
వ్యవస్థలకు చరమగీతం
విద్యా రంగాన్ని ప్రోత్సహించి తెలుగు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జాతీయ, అంతర్జాతీయ స్థా యిలో రాణించాలని రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేశారు. అటువంటి వ్యవస్థకు అనాలోచిత నిర్ణయాలతో చరమగీతం పాడటం దారుణం. ఆప్సీని మరింత అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ మాయలో పడి నిర్వీర్యం చేసేందుకు అడుగులు వేయడం బాధాకరం. –జ్ఞానేశ్వరి,
ప్రైవేటు కాలేజీ అధ్యాపకురాలు, తిరుపతి
విద్యారంగం..నిర్వీర్యం!
ఎస్వీయూలో జీఓ ప్రతుల దగ్ధం
ఆప్సీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 3 ప్రతులను ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద శనివారం ఏఐఎస్‌ఎఫ్ నేతలు దగ్ధం చేసి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రభుత్వ నిర్ణయాలను దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, వర్సిటీ అధ్యక్షులు రవియాదవ్, నాయకులు ఓం రాజ్, చరణ్, మోహన్, సురేష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


