పూలే ఆశయాలు మార్గదర్శకం | - | Sakshi
Sakshi News home page

పూలే ఆశయాలు మార్గదర్శకం

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

తిరుపతి క్రైమ్‌: జ్యోతిరావ్‌ పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కొనియాడారు. జ్యోతిరావ్‌ పూలే జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్‌ శాఖ ఘనంగా నివాళులర్పించింది. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మహిళల విద్యాభివృద్ధి, సమానత్వం కోసం పూలే చేసిన సేవలు అపారమని, ఆయన ఆశయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్‌ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని పూలే స్ఫూర్తితో ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మహిళా విద్యను

ప్రోత్సహించిన మహనీయుడు

తిరుపతి అర్బన్‌: మహిళా విద్యను ప్రోత్సహించిన మహానీయుడు జ్యోతిరావ్‌ పూలే అని జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు అన్నారు. శనివారం పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ పూలే వంటి మహోన్నత వ్యక్తుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్‌ దివాకర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి భరత్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ అధికారులు జ్యోత్స్న, మునేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement