వేడుకగా లక్కీ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా లక్కీ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

● మాల్‌ ప్రారంభోత్సవంలో సినీటి శ్రీలీల సందడి

తిరుపతి కల్చరల్‌: వీవీ మహల్‌ సర్కిల్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్‌ మాల్‌ను గురువారం వేడుకగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరై జ్యోతి ప్రజ్వల చేసి లక్కీ వస్త్ర షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. శ్రీలీల రాకతో ఆమె చూసేందుకు షాపింగ్‌ మాల్‌ వద్ద అభిమానులు హోరెత్తారు. అశేష అభిమానులకు అభివాదం చేస్తూ శ్రీలీల షోరూం వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ లక్కీ షాపింగ్‌ మాల్‌ను గతంలో ఒంగోలులో ప్రారంభించిన తాను ప్రస్తుతం తిరుపతిలో నూతన షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. సౌత్‌ ఇండియాలో ఉండడం ఓ లక్కీ ఫీలింగ్‌ ఆ ఫీలింగ్‌తో లక్కీ షాపింగ్‌ మాల్‌ ఆరంభించానన్నారు. లక్మీ షాపింగ్‌ మాల్‌ ఽఆధునాతన ట్రెండింగ్‌ మోడల్స్‌తో అందరూ మెచ్చే వరైటీ కలెక్షన్లు ఉన్నాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆదరించాలని కోరారు. శారీస్‌ కొనండి అందంగా రెడీ అవ్వండి... ఆనందంగా ఉండండని అన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతూ తాను బాగా చదివి డాక్టర్‌ అవ్వాలన్నది లక్ష్యమని, అయితే అనుకోకుండా వచ్చిన ఆఫర్‌ సినిమాలని తెలిపారు. మెడిసిన్‌ చదివిన తాను ఎండీ పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందించాలన్నది లక్ష్యమని తెలిపారు. ఇక సినిమాల విషయం గురించి ఆమె మాట్లాడుతూ సినిమాల్లో ఇప్పటి వరకు తాను చేసి పాత్రలు సంతృప్తిని ఇచ్చాయని, ప్రస్తుతం మరో ఐదు సినిమాలకు సైన్‌ చేశానని అవి త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. లక్కీ షాపింగ్‌ మాల్‌ అధినేతలు శ్రీనివాస్‌, స్వామి, రత్తయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల అభిరుచుల మేరకు రిటైల్‌ మార్కెటింగ్‌ ట్రెండ్స్‌ విప్లవాత్మకమైన మార్పులకు లోనతున్నారన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ కలెక్షన్స్‌లో తిరుగులేని ఆదరణ పొందిన లక్కీ షాపింగ్‌ మాల్‌ను తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో తమ 16వ స్టోర్‌ను ప్రారంభించడం మహద్బాగ్యమన్నారు. నాణ్యతతో పాటు మీ బడ్జెట్‌ ధరల్లో వస్త్రాలను అందించడం తమ షాపింగ్‌ మాల్‌ ప్రత్యేకతన్నారు. సంపూర్ణ కుటుంబ సభ్యులు మెచ్చే వరైటీ వస్త్రాలను ఎత్నిక్‌ వేర్‌ నుంచి ఆధునిక వెస్ట్రన్‌ స్టైల్స్‌ వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అదిరిపోయే వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement