ఉగాది వేళ.. ఆధ్యాత్మిక శోభ | - | Sakshi
Sakshi News home page

ఉగాది వేళ.. ఆధ్యాత్మిక శోభ

Mar 20 2026 7:52 AM | Updated on Mar 20 2026 7:52 AM

పుష్పాలంకరణలో మహద్వారం

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉగాది విశిష్టతను ప్రతిబింబించేలా శ్రీమహావిష్ణువు మత్స్యావతార రూపంలో హయగ్రీవుడిని సంహరించి, నాలుగు వేదాలను రక్షించి, బ్రహ్మదేవునికి అప్పగిస్తున్న దృశ్యాన్ని టీటీడీ శిలారూపంలో ఆవిష్కరించింది. అలాగే శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద చేసిన పుష్పాలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి ఆలయం ముందు శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాన్ని ఉద్యానవన విభాగం కార్మికులు కళాత్మకంగా రూపొందించారు. మరోవైపు, శ్రీరాముడు, చిన్నికృష్ణుడు, వేణుగాన కృష్ణుడి నమూనాలు ఉగాది ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మికతను జోడించాయి. – తిరుమల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement