– ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతి మంగళం : జిల్లా ప్రజలకు ప్రతి రోజూ పండుగ రోజు కావాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్ది ల గురుమూర్తి, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజవర్గ సమన్వయకర్త భూమన అభిన య్ రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి నగర ప్రజల కు శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ అంటే తీపి, చేదు, పులుపు కలగలిపిన ఉగాది పచ్చడి లాగే ప్రతి మనిషి జీవితంలో కష్టం, సుఖం, నష్టం అనేవి ఉంటాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం లేక అన్నీ కష్టాలే మిగిలాయని తెలిపారు. రాబోయే జగనన్న పాలనలో ప్రజలకు ప్రతి రోజూ పండుగ ఉంటుందన్నారు.
ఏప్రిల్ 13న బీటెక్ ఫైనల్ సెమ్ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో బీటెక్ అన్ని బ్రాంచ్‌ల్లో చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 8వ సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 13వ తేదీన జరగనున్నాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటన లో తెలిపారు. సంబంధిత విద్యార్థులు ఈనెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించి పరీక్షలకు దర ఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హాల్ టికెట్లు వచ్చేనెల 10వ తేదీన జారీ చేయనున్నట్లు తెలిపారు.
డీడీఈ డిగ్రీ రీవాల్యూషన్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ డీడీఈ విభాగం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రథమ, ద్వితీ య సంవత్సరాల డిగ్రీ రీవాల్యూషన్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం ఎస్వీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
గృహ వినియోగ గ్యాస్‌కు ఇబ్బందులు లేవు
తిరుపతి క్రైం: జిల్లాలో గృహాలకు వినియోగించే వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా ఎస్పీ సుబ్బరాయు డు స్పష్టం చేశారు. ప్రజల్లో కృత్రిమ కొరత సృష్టించి అపోహలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంతమంది గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, సివిల్ సఫ్లయ్ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ముమ్మర దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్ప డే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గృహ వినియోగ గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, అవసరమైతే సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అలాగే గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారి గురించి ఎవరైనా సమాచారం అందించాలన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ సుబ్బరాయుడు భరోసా ఇచ్చారు.
ఉపకరణాల పంపిణీకి
శిబిరాలు పూర్తి
తిరుపతి అర్బన్: దివ్యాంగులు, వయోవృద్ధులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాల పంపిణీ కోసం 15 రోజులు నిర్వహించిన శిబిరాలు పూర్తి చేసినట్లు వికలాంగుల సంక్షేమశాఖ అధికారి వినోద్ వెల్లడించారు. 2,308 మంది దివ్యాంగులకు పరిశీలన అనంతరం 3,939 సహాయక పరికరాలు ఇవ్వడానికి ఎంపిక చేశామని చెప్పారు. అలాగే 1,129 మంది వయోవృద్ధులను పరిశీలించి 5,591 సహాయక పరికరాల పంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. మొత్తం పరికరాలకు రూ.4.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. జూన్‌లో పరికరాలను పంపిణీ చేస్తామన్నారు.


