తిరుపతి మంగళం : పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శుక్ర వారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ కమిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు నాగూరి యోగాంజనేయరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, బూత్‌కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
టీటీడీ ట్రస్టులకు
రూ.37.55 లక్షల విరాళాలు
తిరుమల:టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు గురు వారం పలువురు దాతలు రూ.37.55 లక్షలు విరా ళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సుజన్ జ్యువెలరీ అధినేత రవికుమార్ రూ.20 లక్షల వి రాళం ఇచ్చారు. గురువారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి, శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టు కు రూ.10 లక్షలు, శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు చొప్పున విరాళాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మధుశేషు అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన మరో దాత ఆలపాటి సత్యదేవ్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.


